ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత

Tollywood Veteran Actor Chalapathi Rao Passed Away,Tollywood Veteran Actor Chalapathi Rao,Chalapathi Rao Passed Away,Chalapathi Rao Demise,Mango News,Mango News Telugu,Actor Chalapathi Rao Son,Chalapathi Rao Young,Chalapathi Rao Death,Chalapathi Rao Age,Actor Chalapathi Rao Family Photos,Chalapathi Rao Wife,Chalapathi Rao Daughter,Chalapathi Rao Movies,Chalapathi Rao Telugu Actor,Actor Chalapathi Rao Age,Actor Chalapathi Rao,Actor Chalapathi,Chef Chalapathi Rao,Telugu Actor Chalapathi Rao,Chalapathi Rao Actor,Actor Chalapathi Rao Wife

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌ లోని తన నివాసంలో చలపతిరావు తుదిశ్వాస విడిచారు. చలపతిరావుకు కుమారుడు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీనియర్ నటులు ఒక్కొక్కరిగా దూరమవుతుంటే తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకుంది. 2 రోజుల క్రితమే సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ మరణించగా, తాజాగా చలపతిరావు హఠాన్మరణంతో పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

తమ్మారెడ్డి చలపతిరావు 1944, మే 8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించారు. 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమాతో చలపతిరావు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. 1200కి పైగా సినిమాల్లో అనేక కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చలపతిరావు తనదైన ముద్రవేశారు. విలన్ పాత్రల్లో తనదైన శైలిలో మెప్పిస్తూ చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించారు. సహాయ నటుడిగా, కమెడియన్‌ గా, విలన్ గా ఇలా ఎన్నో విభిన్న రకాల పాత్రలతో మెప్పించిన గొప్ప నటుల్లో ఒకరిగా చలపతిరావు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి ఎంతో ప్రీతిపాత్రులు, సన్నిహితులుగా చలపతిరావు ఉండేవారు. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ నుంచి యువతరం జూనియర్‌ ఎన్టీఆర్‌ సహా పలువురి నటుల చిత్రాల్లో చలపతిరావు కీలక పాత్రలు పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే కలియుగ కృష్ణుడు, ప్రెసిడెంట్ గారి అల్లుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట వంటి చిత్రాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. కాగా చివరిగా 2021లో విడుదలైన బంగార్రాజు చిత్రంలో చలపతిరావు నటించారు.

చలపతిరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పార్దిస్తున్నారు. అలాగే చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మరోవైపు చలపతిరావు పార్థివదేహాన్ని ఎమ్మెల్యే కాలనీలోని తన కుమారుడు రవిబాబు ఇంట్లో ఉంచడం జరిగింది. పార్థివదేహాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మహా ప్రస్థానంకు తరలించి ఫ్రీజర్ లో ఉంచుతారని, అమెరికాలో ఉంటున్న చలపతిరావు కుమార్తె రాగానే బుధవారం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =