కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నటి ఊర్మిళా మతోండ్కర్

Actress Urmila Matondkar Quits Congress Party, Actress Urmila Matondkar Quits Congress Party in Six Months, latest political breaking news, national news headlines today, national news updates 2019, National Political News 2019, Urmila Matondkar Congress, Urmila Matondkar Political News, Urmila Matondkar Quits Congress Party, Urmila Matondkar Quits Congress Party in Six Months, Urmila Matondkar Resigns From Congress, Urmila Matondkar Resigns From Congress Party

కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన సినీనటి ఊర్మిళా మతోండ్కర్, ఆరు నెలల తిరగకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం నాడు ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్న సమయంలోనే ఊర్మిళా మతోండ్కర్ రాజీనామా చేయడం విశేషం. పార్టీలోని అంతర్గత రాజకీయాల వలనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ఊర్మిళా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్‌లోని కీలక సభ్యులు పార్టీని మార్చలేకపోయారని, స్వార్ధ ప్రయోజనాలకోసం అంతర్గత రాజకీయాలు జరిపే కొందరు తనను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అందుకు తన రాజకీయ,సామాజిక భావాలు అంగీకరించడంలేదని ఆమె పేర్కొన్నారు.

బాలీవుడ్ తో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఊర్మిళా 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు, మార్చినెలలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. లోక్ సభ ఎన్నికలలో ముంబయి ఉత్తర నియోజక వర్గం నుంచి ప్రముఖ బీజేపీ నాయకుడు గోపాల్ శెట్టి పై పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మే నెలలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలను ప్రస్తావిస్తూ ముంబయి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మిలింద్ దేవరాకు ఒక లేఖ కూడ రాసారు. తన ఓటమికి పార్టీలోని కొన్ని వర్గాలు పని చేశాయని గతంలోనే ఊర్మిళా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత కలహాలతో విసిగిపోయి, పార్టీ వ్యవహారాలపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తునట్టు ఊర్మిళా లేఖలో వివరించారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here