జేఈఈ మెయిన్-2022 పరీక్షలు మరోసారి వాయిదా, పరీక్షల నిర్వహణ ఎప్పుడంటే?

JEE Main-2022 Session 1 and Session 2 Exams Dates Rescheduled, JEE Main-2022 Session 1 Exams Dates Rescheduled, JEE Main-2022 Session 2 Exams Dates Rescheduled, JEE Main-2022 Exams Dates Rescheduled, JEE Main-2022 Exams Dates, JEE Main 2022 Session 1 Exams Postponed To June, JEE Main 2022 Session 2 Exams Postponed To July, JEE main 2022 exam dates rescheduled, JEE Main 2022 postponed, JEE Main 2022 Exams Dates postponed, JEE Main, JEE Main 2022, 2022 JEE Main, Joint Entrance Exam Mains 2022 Exams Dates Rescheduled, 2022 Joint Entrance Exam Mains Exams Dates Rescheduled, JEE Main 2022 Latest News On Exams Dates Rescheduled, JEE Main 2022 Latest Updates On Exams Dates Rescheduled, Mango News, Mango News Telugu,

దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2022 పరీక్షలు మరోసారి వాయిదా వడ్డాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం నాడు కొత్త షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ రెండు విడతలు/సెషన్స్ లో జేఈఈ మెయిన్‌-2022 పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఏ ప్రకటించిన కొత్త షెడ్యూల్ ప్రకారం మొదటి విడత పరీక్షలు జూన్ 20-29 వరకు (20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29వ తేదీల్లో) జరుగనుండగా, రెండో విడత పరీక్షలు జూలై 21-30 వరకు (21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30వ తేదీల్లో) జరుగనున్నాయి.

దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే జేఈఈ మెయిన్‌-2022 పరీక్షలను రీషెడ్యూలు చేసినట్టుగా ఎన్టీఏ ప్రకటించింది. మొదటివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసిందని, రెండో విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు www.nta.ac.in మరియు www.jeemain.nta.nic.in వెబ్ సైట్స్ సందర్శించాలని సూచించారు.

ముందుగా జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు ఏప్రిల్ 16-21 వరకు, రెండో విడత పరీక్షలు మే 24-29 వరకు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే మొదటి విడత పరీక్షల కోసం ప్రకటించిన తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఇంటర్ బోర్డు పరీక్షలు నిర్వహణ ఉండడంతో, విద్యార్థులు నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో మొదటి విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించించారు. తాజాగా జేఈఈ మెయిన్-2022 రెండు విడతల పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =