ఆగస్ట్ 5వ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో, జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలోని మిగతా అన్ని రాష్టాల లాగానే కేంద్రప్రభుత్వ పరిధి లోకి వచ్చింది.
ఆర్టికల్-370 ముఖ్య వివరాలు:
- జమ్మూ కశ్మీర్ మహారాజు రాజా హరిసింగ్ 1947లో తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసారు
- 1949 లో అప్పటి రాజు షేక్ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి రాజ్యంగంలో ఆర్టికల్-370ని చేర్చారు
- ఆర్టికల్-370 జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కలిపిస్తుంది
- జమ్మూ కశ్మీర్ రాజు షేక్ అబ్దుల్లా, జవహర్ లాల్ నెహ్రూతో చర్చలు జరిపి ఆర్టికల్ 35ఏ ను రాజ్యాంగంలో చేర్చారు
- 1956 లో జమ్మూ కశ్మీర్ లో నివసించే వారి గురించి కొత్త అంశాలను రాజ్యాంగంలో ప్రత్యేకంగా రూపొందించారు
- రాజా హరిసింగ్ వద్ద పనిచేసిన గోపాల్ స్వామి అయ్యంగార్ ఆర్టికల్-370 ని రూపొందించాడు
- జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఉండటంవలన, ఇతర రాష్ట్రాల మాదిరిగా రాజ్యాంగ నిబంధనలు వర్తించవు
- విదేశీ వ్యవహారాలు,ఆర్థిక, సమాచార, రక్షణ అంశాల మినహా, పార్లమెంట్ చేసే ఇతర ఏ చట్టానికైనా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి
- జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి 6 సంవత్సరాలుగా నిర్ణయించారు
- ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎవరు జమ్మూ కశ్మీర్ లో స్థలాలు,ఆస్తులు కొనలేరు
- జమ్మూ కశ్మీర్లో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం వర్తించదు
- రాష్ట్రంలో ఎటువంటి అత్యవసర పరిస్థితులను విధించడానికి భారత రాష్ట్రపతికి అనుమతి లేదు.
- కేవలం యుద్ధం, విదేశీ ఆక్రమణ సమయలో మాత్రమే కేంద్రం జమ్మూ కశ్మీర్లో ఎమర్జెన్సీ విధించగలదు
- జమ్మూ కశ్మీర్ నివాసితులకు ప్రత్యేక జెండాతో ద్వంద్వ పౌరసత్వం ఉంది.
- భారత జెండాను అగౌరవపరచడం జమ్మూ కశ్మీర్లో నేరం కాదు మరియు జాతీయ వ్యతిరేక చర్య కాదు
- జమ్మూ కశ్మీర్ పౌరులు కాని వ్యక్తిని ఏ స్త్రీ అయినా వివాహం చేసుకుంటే, ఆమె తన పౌరసత్వం (రాష్ట్ర హక్కులు) మొత్తాన్ని కోల్పోతుంది. కాగా, ఎవరైనా మహిళ పాకిస్తానీ వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆమెకు జమ్మూ కశ్మీర్ పౌరసత్వం లభిస్తుంది.
- ఆర్టికల్ 370 ను ఆ రాష్ట్ర అసెంబ్లీ సిఫారసుపై మాత్రమే రద్దు చేయవచ్చు
- జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక శిక్షా స్మృతి అమలులో ఉంది.
[subscribe]
[youtube_video videoid=ngD33o3FdnM]