వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్.. ప్రాసెసింగ్ ఫీ కూడా మాఫీ..!

Bank of Maharashtra Cuts Home Car Loan Interest Rates Upto 20 Basis Points and Waives Processing Fee,Bank of Maharashtra Cuts Home Car Loan,Interest Rates Upto 20 Basis Points,Waives Processing Fee,Bank of Maharashtra Waives Processing Fee,Mango News,Mango News Telugu,Bank of Maharashtra slashes interest rates,Bank Loan Interest Rate Cut,Bank of Maharashtra Latest News,Bank of Maharashtra Latest Updates

మీరు హోమ్ లోన్, వెహికిల్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్‌న్యూస్. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ప్రముఖ బ్యాంక్ తాజాగా రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆ బ్యాంకులో లోన్ తీసుకునే వారికి చాలా వరకు బారం తగ్గనుంది. అదే బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర. తాజాగా రుణ రేట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బ్యాంక్ తాజాగా హోమ్ లోన్స్, కారు లోన్స్‌పై రుణ రేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేట్ల తగ్గింపు ఆగస్ట్ 14 నుంచి అంటే సోమవారం నుంచే అమలులోకి వస్తుందని బ్యాంక్ వెల్లడించింది. దీంతో తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్స్, కారు లోన్స్ పొందొచ్చు.

పుణె ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర. ప్రస్తుతం ఈ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.5 శాతం ఆఫర్ చేస్తోంది. ఇది వరకు హోమ్ లోన్ వడ్డీ రేటు 8.6 శాతంగా ఉంది. ఇక కారు రుణాలపై 8.9 శాతం వడ్డీ రేటుకు కాకుండా 8.7 శాతం వడ్డీ రేటుకు అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్యాంక్ మరో బెనిఫిట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. హోమ్ లోన్స్, కారు లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈలోన్లు రెపో రేటు ఆధారత లోన్ రేట్లుగా పిలుస్తారు. ప్రస్తుతం ఆర్ఎల్ఆర్ఆర్ 9.3 శాతంగా ఉంది. సిబిల్ స్కోర్ 800పైన ఉన్న వారికి ఈ తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.

ఒక వైపు రుణ రేట్లు తగ్గింపుతోపాటు మరో వైపు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేయడం వల్ల హోమ్ లోన్స్, కారు లోన్స్ తీసుకునే వారికి భారీ ఊరట కలుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బ్యాంకులు రుణాలపై అధిక వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. గత ఏడాది కాలంగా రుణ రేట్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే రుణ రేట్లు తగ్గింపు ప్రకటన తరుణంలో బ్యాంక్ కస్టమర్లకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాగా మరో వైపు బ్యాంక్ ఇప్పటికే ఎడ్యుకేషన్ లోన్స్, గోల్డ్ లోన్స్‌పై కూడా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ కల్పిస్తోంది. ఉడాన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ప్రయోజనాలు అందిస్తోంది.

మరోవైపు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడోసారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచకపోయినప్పటికీ పలు దిగ్గజ బ్యాంకులు కీలక రుణ రేట్లను పెంచుతున్నట్లు ఈ రెండు రోజుల్లోనే ప్రకటించడం గమనార్హం. అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాత్రం వాటికి విరుద్ధంగా వడ్డీ రేట్లను తగ్గించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =