ఇండియాతో పాటు మరో 6 దేశాల టూరిస్ట్‌లకు వీసా ఫ్రీ ఎంట్రీ

Passport is not needed to go to Sri Lanka Visa free entry for tourists from 6 other countries besides India,Passport is not needed to go to Sri Lanka,Sri Lanka Visa free entry for tourists,From 6 other countries besides India,Mango News,Mango News Telugu,Ali Sabry,visa free entry, India,Sri Lanka,Passport, Sri Lanka, tourists, India,Russia, China, Japan, Malaysia, Indonesia, Thailand,Sri Lanka Visa free entry Latest News,Sri Lanka Visa free entry Latest Updates,Sri Lanka Visa free entry Live News
Ali Sabry,visa free entry, India,Sri Lanka,Passport, Sri Lanka, tourists, India,Russia, China, Japan, Malaysia, Indonesia, Thailand

ఏ దేశానికి అయినా  ఆదాయాన్ని పెంచే రంగాలలో టూరిజం సెక్టార్‌ ముందే ఉంటుంది. అందుకే అన్ని దేశాలు పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తారు. కరోనా సమయంలో అన్ని దేశాలు ఆర్ధికంగా చితికిపోవడానికి  కూడా కారణం ఆ టైములో పర్యాటక రంగం కుదేలవడమే. కరోనా ఎక్కడివారిని అక్కడే కూర్చోబెట్టేయడంతో టూరిస్టు ప్రాంతాలన్నీ వెలవెలబోయాయి. ఈ ప్రభావం అన్ని దేశాలపై పడి ఆర్ధికమాంద్యం బారిన పడేలా చేసాయి. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం పుంజుకుంటోంది. అందుకే  తాజాగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ద్వీపదేశమైన శ్రీలంక ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

భారతదేశంతో పాటు మరో 6  దేశాల పౌరులకు వీసా లేకుండానే.. శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి  అనుమతివ్వాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్‌, రష్యా, చైనా, జపాన్, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ దేశాల టూరిస్టులకు ఉచిత వీసాలు జారీ చేయడానికి  శ్రీలంక కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేరళ  విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టే ఈ కార్యక్రమం వచ్చే 2024 మార్చి 31 వరకూ కొనసాగుతుందని ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా తెలియజేశారు.

అందాలు కొలువున్న దేశంగా గుర్తింపబడ్డ శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. దేశ జీడీపీలో 10 శాతం వాటా శ్రీలంకదే అంటే పర్యాటక రంగంలో శ్రీలంక పాత్రను అర్ధం చేసుకోవచ్చు. అయితే కరోనా మహమ్మారి రాక ముందు లంక పర్యాటక ఆదాయం 360 కోట్ల డాలర్లు  ఉండగా.. దాని తర్వాత బాగా పడిపోయింది.  ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. 2019 నాటి కరోనా వైరస్ సంక్షోభానికి శ్రీలంక పర్యాటక రంగం  మొత్తం కుదేలైంది. దానికి తోడు ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో శ్రీలంక మొత్తం సంక్షోభంలోకి జారిపోవడంతో.. ఆ దేశానికి పర్యాటకుల రాక మెల్లగా తగ్గిపోయింది.

ప్రతి ఏడాది  శ్రీలంకకు వచ్చే పర్యాటకుల్లో 30 శాతం మంది రష్యా, ఉక్రెయిన్‌, పోలాండ్‌, బెలారస్‌కు చెందినవారే ఉంటారు. అయితే అక్కడ యుద్ధం  ఇంకా శాంతించకపోవడం వల్ల ఇప్పుడు అక్కడి టూరిస్టులు వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల  శ్రీలంక ఆదాయానికి మరింతగా గండిపడింది. దీంతో ఈ  పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి నడుం కట్టిన శ్రీలంక ప్రస్తుతం పర్యాటక రంగాన్ని  ప్రోత్సహించడానికి ప్రయత్నాలు ప్రారంభించిందది. దీంతో  2023 సంవత్సరానికి 20 లక్షల మందిని ..2024 మార్చికి కోటికి పైగా  టూరిస్టులను ఆకట్టుకోవడమే  లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే  ఫ్రీ వీసా పాలసీని తీసుకొచ్చింది.  2023 సెప్టెంబర్​‌లో 10 లక్షల మందికి పైగా టూరిస్టులు శ్రీలంకకు వెళ్లారు. 2019 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో టూరిస్టులు రావడం ఇదే తొలిసారి. ఇంకా చెప్పాలంటే  శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితులు కాస్త బాగానే మెరుగుపడుతున్నాయి ఈ అవకాశాన్ని వదులుకోకుండా మరింత పెంచడానికి శ్రీలంక ప్రభుత్వం  ఫ్రీ వీసా పాలసీకి శ్రీకారం చుట్టింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − thirteen =