పెరుగుతోన్న IRCTC యాప్ మోసాలు.. అలర్ట్‌గా ఉండాలంటున్న అధికారులు

IRCTC Warns Users About Fraudulent Rail Connect Fake App,IRCTC Warns Users,Users About Fraudulent Rail,Fraudulent Rail Connect Fake App,Mango News,Mango News Telugu,IRCTC app scams on the rise, officials to be alert, IRCTC app,Scammers target, Android users, by sending phishing links, IRCTC has alerted, IRCTC fake app campaign,Rail Connect Fake App Latest News,Rail Connect Fake App Latest Updates,IRCTC,IRCTC Latest News,IRCTC Latest Updates,Rail Connect Fake App Latest News

నిజం గడప దాటకముందే ..అబద్దం ఊరంతా చుట్టి వచ్చిందన్నట్లుగా.. ఒరిజినల్ యాప్ కంటే ముందే నకిలీవే మార్కెట్లో రన్ అవుతున్నాయి. ఎక్కువ మంది వాడే ప్రముఖ సైట్లను టార్గెట్ చేసుకున్న కొందరు కేటుగాళ్లు.. అచ్చంగా అలాంటి యాప్స్‌ను క్రియేట్ చేస్తూ.. ఫేక్ యాప్స్ ‌తో యూజర్లను దోచుకుంటున్నారు. ఇటు యూజర్లు కూడా అచ్చంగా అలాగే ఉండటంతో అడ్డంగా మోసపోతున్నారు.

దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ అయిన ఐఆర్సీటీసీపై..సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌నే సింపుల్‌గా ఐఆర్‌సీటీసీ అని పిలుచుకునే సైట్‌నే చాలా ఎక్కువ సంఖ్యలోనే వాడుతున్నారు. డైరక్టుగా రైల్వే స్టేషన్‌కో, రైల్వే కౌంటర్‌కో వెళ్లి రైల్వే సేవలు పొందే రోజుల నుంచి ఇంట్లో నుంచే ఈజీగా ఈ సైట్‌లోనే చాలామంది తమ పనులు చేసుకుంటున్నారు. దీంతో ఇది రైల్వే టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌గా.. ప్రతిరోజూ లక్షలాది మంది టిక్కెట్‌లను బుక్ చేసుకుంటూ ఉంటారు. దీంతోనే స్కామర్స్ యూజర్స్‌ను బురిడీ కొట్టించడానికి దీనిని ఎంచుకుంటున్నారు.

తాజాగా ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. ఐఆర్‌సీటీసీ నకిలీ యాండ్రాయిడ్ యాప్ స్కామ్ గురించి వినియోగదారులను హెచ్చరించారు. నకిలీ ఐఆర్‌సీటీసీ యాప్‌ను.. డౌన్‌లోడ్ చేయడానికి ఫిషింగ్ లింక్‌లను పంపుతూ.. యాండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటారు స్కామర్‌లు. దీంతో ఐఆర్‌సీటీసీ ఈ ఫేక్ యాప్ స్కామ్ గురించి తన కస్టమర్లకు ఇ మెయిల్ ద్వారా అలర్ట్ చేసింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ X లో.. ఐఆర్సీటీసీ నకిలీ యాప్ ప్రచారం గురించి తమ వినియోగదారులను హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 11 లక్షలకు పైగా ట్రైన్ టిక్కెట్స్ బుక్ అవుతున్నాయి. ఈ టిక్కెట్లలో చాలా వరకు చూసుకుంటే.. ఐఆర్‌సీటీసీ యాప్‌తోనే బుక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు నకిలీ ఐఆర్‌సీటీసీ యాప్‌కి సంబంధించిన లింక్.. చాలామందికి ఇమెయిల్ లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పంపబడుతోంది. ఇది అచ్చంగా అలాగే ఉండటంతో చాలామంది ఈ నకిలీ యాప్‌లో టికెట్లు బుక్ చేసుకుని అడ్డంగా మోసపోతున్నారు .

దీంతో ఐఆర్‌సీటీసీ తమ యూజర్లను అలర్ట్ చేసింది. ఐఆర్‌సీటీసీ నకిలీ మొబైల్ యాప్ ఇప్పుడు వోగ్‌లో ఉందని.. రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ట్వీట్ చేసింది. కొంతమంది మోసగాళ్లు ఫిషింగ్ లింక్‌లను పంపి.. నకిలీ ‘ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్’ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని హెచ్చరించింది. ఎవరూ కూడా మోసగాళ్ల బారిన పడవద్దని సూచించింది. గూగుల్ లేదా యాపిల్ ప్లే స్టోర్ నుంచి అధికారిక వెబ్‌సైట్ మాత్రమే వాడాలి తప్ప.. లింక్స్‌ వాడొద్దని హెచ్చరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seven =