దక్షిణాఫ్రికాతో సిరీస్ కు భారత మహిళల వన్డే, టీ20 జట్ల ఎంపిక

bcci, BCCI Announced India Women’s Squad for ODI and T20I Series, BCCI Announces India Women ODI, BCCI announces India women’s ODI and T20I squads, BCCI announces India women’s squad for ODI, BCCI names India women squad for ODI and T20I, India women vs South Africa, India Women’s Squad for ODI and T20I Series, India Women’s Squad for ODI and T20I Series Against South Africa, Indian Women Squad For Odi, Mango News, South Africa, Women’s Squad for ODI and T20I Series

భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. మార్చి 7, 2021 నుంచి మార్చి 23, 2021 వరకు జరగబోతే ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు 5 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ మ్యాచులు అన్ని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తలపడే భారత మహిళల వన్డే, టీ20 జట్లను అఖిల భారత మహిళా సెలెక్షన్ కమిటీ శనివారం నాడు ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. వన్డేలకు మిథాలీ రాజ్‌, టీ20లకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

వన్డే జట్టు:

మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిక్స్, పూనమ్‌ రౌత్‌, ప్రియా పునియా, ఎస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్‌ కౌర్ (వైస్ కెప్టెన్), డీ.హేమలత, దీప్తి శర్మ, సుష్మ వర్మ (వికెట్ ‌కీపర్‌), శ్వేత వర్మ (వికెట్‌ కీపర్), రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, జులన్ గోస్వామి, మన్సి జోషి, పూనమ్‌ యాదవ్‌, సీ ప్రత్యూష, మోనిక పటేల్‌.

టీ20 జట్టు:

హర్మన్‌ప్రీత్‌ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మందాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిక్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, హర్లీన్‌ డియోల్, సుష్మ వర్మ (వికెట్ ‌కీపర్‌), నుజాత్ పర్వీన్‌ (వికెట్ ‌కీపర్‌), అయూషి సోని, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌, మన్సి జోషి, మోనిక పటేల్‌, సీ ప్రత్యూష, సిమ్రాన్‌ దిల్ బహదూర్.

భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌ షెడ్యూల్ వివరాలు:

వన్డేలు:

  • మొదటి వన్డే – మార్చి 7 – లక్నో
  • రెండవ వన్డే – మార్చి 9 – లక్నో
  • మూడవ వన్డే – మార్చి 12 – లక్నో
  • నాలుగవ వన్డే – మార్చి 14 – లక్నో
  • ఐదవ వన్డే – మార్చి 17 – లక్నో

టీ20లు:

  • మొదటి టీ20 – మార్చి 20 – లక్నో
  • రెండ‌వ టీ20 – మార్చి 21 – లక్నో
  • మూడవ టీ20 – మార్చి 23 – లక్నో
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =