టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.2,937 కోట్లతో వార్షిక బడ్జెట్‌ ఆమోదం

Annual Budget Approved with Rs 2937 Crores, Mango News, Tirumala, Tirumala Tirupati Devasthanam, Tirupati, TTD annual budget, TTD annual budget 2020-21, TTD annual budget for 2020-21, TTD approves annual budget of Rs 2937 crore, TTD Board approves 2020-21 financial year budget, TTD Board Meeting, TTD Trust Board, TTD trust board approves annual budget, TTD trust board approves annual budget for 2020-21

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 27, శనివారం నాడు తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ వార్షిక బడ్జెట్ సహా పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.

టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు:

  • 2021-22 సంవత్సరానికి రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ ఆమోదం.
  • టీటీడీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయం.
  • ఏప్రిల్ 14 ఉగాది పండుగ రోజు నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం.
  • రథసప్తమి వాహన సేవలను వైభవంగా నిర్వహణ.
  • తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ఏర్పాటు.
  • శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అన్నదానం చేయాలని నిర్ణయం.
  • ముంబయి, జమ్మూ కాశ్మీర్ లో శ్రీవారి ఆలయాల నిర్మాణం త్వరలో ప్రారంభం.
  • దేశంలోని అన్ని టీటీడీ కళ్యాణ మండపాలు అభివృద్ధి, వివాహాలు, దైవ కార్యాలకే వినియోగించుకునేలా చర్యలు.
  • టీటీడీ వేదపాఠశాలల పేర్లను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేర్లు మార్చాలని నిర్ణయం.
  • తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రిలో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు రూ.9 కోట్లు కేటాయింపు.
  • నెయ్యి నిల్వ ట్యాంకుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయం.
  • అయోధ్యలో టీటీడీకి భూమి కేటాయించాలని అక్కడి ప్రభుత్వానికి విన్నపం. శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయం నిర్మించాలని నిర్ణయం.
  • తిరుమలలోని అతిధి గృహాల్లో విద్యుత్ వృథాను నియంత్రణకు ఎనర్జీ మీటర్లు ఏర్పాటు.
  • గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =