శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్.. ఫిట్‌నెస్ లేమితో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం

Big Blow To Team India Pacer Jasprit Bumrah Ruled Out of 3-Match ODI Series Against Sri Lanka Due To Fitness Concerns,Jasprit Bumrah Ruled Out,ODI Against Sri Lanka,Amid Health Concerns,Mango News,Jasprit Bumrah Wife,Jasprit Bumrah Stats,Jasprit Bumrah Net Worth,Cricket Jasprit Bumrah,Jasprit Bumrah News,Jasprit Bumrah Wiki,Jasprit Bumrah Injury,Jasprit Bumrah Age,Jasprit Bumrah Replacement,Jasprit Bumrah T20 World Cup,Jasprit Bumrah Ranji Team,Jasprit Bumrah Twitter

శ్రీలంకతో జనవరి 10నుంచి జరుగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోమవారం వెల్లడించింది. గత కొన్ని నెలలుగా గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రాను శ్రీలంకతో జరుగబోయే సిరీస్‌కు తొలుత ఎంపిక చేయలేదు. అయితే ఇటీవలే అతడిని భారత వన్డే జట్టులోకి తీసుకున్నారు. కానీ ఫిట్‌నెస్ టెస్టులో బుమ్రా విఫలం కావడంతో అతడికి మరికొంతకాలం విశ్రాంతిని ప్రకటించారు. జట్టుతో చేరేందుకు సిద్ధమైన బుమ్రా బౌలింగ్‌లో పుంజుకోవడానికి మరికొంత సమయం కావాలని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సెలక్షన్ కమిటీ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరినీ నియమించలేదు. కాగా మంగళవారం నుంచి గౌహతి వేదికగా మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =