పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ హైకమాండ్

AICC and Party In-charges, all india congress committee, Congress, congress party, Congress Party Makes Key Changes In CWC, Congress President, Congress Working Committee, congress working president, CWC Meet Highlights, national news, national political news, Sonia Gandhi, Sonia Gandhi Latest News, Telangana Congress working president

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నాడు పార్టీలో కీలక మార్పులకు‌ శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసీసీ) లో భారీ మార్పులు చేశారు. అలాగే పార్టీ సంస్థాగత మరియు కార్యాచరణ విషయాలలో సోనియా గాంధీకి సహాయపడటానికి ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఏఐసీసీ కేంద్ర ఎన్నికల అథారిటీలో కొత్త సభ్యులకు చోటు కల్పించారు. మరోవైపు పలు రాష్ట్రాలకు సంబంధించి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలకు ఇన్‌ఛార్జులుగా కొత్తవారిని నియమించారు. అందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆర్సీ కుంతియా స్థానంలో‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ను నియమించారు. అలాగే ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా పార్టీ జనరల్ సెక్రటరీ ఊమెన్‌చాందీనే కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nineteen =