కేంద్ర మంత్రి కొడుకు ఇంట్లో యువకుడి దారుణ హత్య.. అసలు అక్కడ ఏం జరిగింది..?

Body Found at Union Minister Kaushal Kishores Home at Lucknow,Body Found at Union Minister Home,Body Found at Kaushal Kishores Home,Body Found at Lucknow Home,Minister Kaushal Kishores Home at Lucknow,Mango News,Mango News Telugu,Union Ministers son, Union Minister,Union Minister Kaushal Kishore, Vikas Kishore,Union Minister Kaushal Kishore Latest News,Body Found at Lucknow Latest News,Body Found at Lucknow Latest Updates,Body Found at Lucknow Live News

కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడి ఇంట్లో 30 ఏళ్ల వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. హత్యకు గురైన వ్యక్తి వినయ్ శ్రీవాస్తవ్ (30) అని జాయింట్ పోలీస్ కమిషనర్ ఆకాష్ కుల్హారీ తెలిపారు. ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేంద్ర బీజేపీ మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడు వికాస్ కిషోర్ నివాసంలో శ్రీవాస్తవ తుపాకీ తుటాల దెబ్బకు మరణించాడని పోలీసులు అన్నారు.

శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కౌశల్ కిషోర్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయం దర్యాప్తులో ఉందని, వివరాలు తెలుసుకుని మాట్లాడతానని చెప్పారు.

ప్రస్తుతం కేంద్ర మంత్రి కుమారుడు ఢిల్లీలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. బాధితుడి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినయ్ శ్రీవాస్తవ్ రాత్రి వికాస్ కిషోర్ ఇంటికి వెళ్లాడు. అజయ్ రావత్, అంకిత్ వర్మ, షమీమ్, బాబా కేంద్ర మంత్రి కుమారుడి ఇంట్లో ఉన్నారని చెప్పారు. ‘అందరితో కలిసి సోదరుడు వినయ్ భోజనం చేశారని, ఏదో విషయంలో వారి మధ్య గొడవ జరిగిందని, ఇంతలో నా సోదరుడు వినయ్‌ని తుపాకీతో కాల్చి చంపేశారు’ అని బాధితుడి సోదరుడు ఆరోపించారు. ‘నాకు మా అన్న చావు మీద అనుమానం ఉందని, అతన్ని కాల్చి చంపారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 6 =