టర్కీ, సిరియాలో ‘ఆపరేషన్ దోస్త్’ లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ప్రధాని మోదీ సమావేశం

PM Modi Interacted with NDRF Personnel involved in Operation Dost in Earthquake-hit Turkey and Syria,PM Modi Interacted,NDRF Personnel involved,Operation Dost in Earthquake,Earthquake-hit Turkey and Syria,Mango News,Mango News Telugu,Earthquake in Turkey,Turkey and Cyria,Turkey Earthquake 2023,Antakya Turkey Earthquake,Biggest Turkey Earthquake,Istanbul Turkey Earthquake Today,Kusadasi Turkey Earthquake,Last Turkey Earthquake,Turkey Biggest Earthquake,Turkey Earthquake,Turkey Earthquake 2022,Turkey Earthquake 2023 News,Turkey Earthquake Latest News,Turkey Earthquake News,Turkey Earthquake Prediction,Turkey Earthquake Reason,Turkey Earthquake Risk Map,Turkey Earthquake Time Today,Turkey Earthquake Today,Turkey Istanbul Earthquake Today,Turkey Latest Earthquake

భూకంపం సంభవించిన టర్కీ మరియు సిరియాలో ‘ఆపరేషన్ దోస్త్’ లో పాల్గొన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందితో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమై సంభాషించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, భూకంపం సంభవించిన టర్కీ మరియు సిరియాలో ‘ఆపరేషన్ దోస్త్’లో వారు చేసిన గొప్ప పనికి వారిని ప్రశంసించారు. వసుధైవ కుటుంబం అనే భావనను ప్రధాని వివరించారు. ప్రపంచం మొత్తం మనకు ఒకే కుటుంబం అనే స్ఫూర్తిని టర్కీ మరియు సిరియాలో భారత బృందం ప్రతిబింబిచిందని ప్రధాని అన్నారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో సత్వర ప్రతిస్పందన సమయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రధాని మోదీ ‘గోల్డెన్ అవర్’ గురించి ప్రస్తావించారు. టర్కీలో ఎన్డీఆర్ఎఫ్ బృందం యొక్క వేగవంతమైన ప్రతిస్పందన మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. సత్వర స్పందన జట్టు సన్నద్ధత మరియు శిక్షణ నైపుణ్యాలను హైలైట్ చేసిందని అన్నారు. బృందంలోని స‌భ్యుల‌కు వారి ప్ర‌య‌త్నాల‌కు ఆశీర్వదించిన ఓ త‌ల్లి చిత్రాల‌ను ప్ర‌ధాని గుర్తు చేసుకుంటూ, బాధిత ప్రాంతాల‌లో జ‌రిగిన రెస్క్యూ, రిలీఫ్ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ప్ర‌తీ చిత్రాన్ని చూసిన త‌ర్వాత ప్ర‌తి భార‌తీయుడు, ప్ర‌తి ఒక్క‌రు గ‌ర్వ‌ప‌డుతున్నార‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. సాటిలేని వృత్తి నైపుణ్యం మరియు మానవ స్పర్శను ప్రధాని ప్రస్తావిస్తూ, ఒక వ్యక్తి గాయంతో ఉన్నప్పుడు మరియు ప్రతిదీ కోల్పోయినప్పుడు అది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం చూపిన సానుభూతితో కూడిన చర్యలను కూడా ప్రధాని ప్రశంసించారు.

2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంపాన్ని గుర్తు చేసుకుంటూ, అక్కడ వాలంటీర్‌గా పనిచేసిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ, శిథిలాలు తొలగించి, దిగువన ఉన్న వ్యక్తులను కనుగొనడం కష్టమని మరియు భుజ్‌లో ఆసుపత్రి కూలిపోవడంతో మొత్తం వైద్య వ్యవస్థ ఎలా దెబ్బతిందో ప్రధాని గుర్తు చేశారు. 1979లో జరిగిన మచ్చు డ్యామ్ దుర్ఘటనను కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. “ఈ విపత్తులలో నా అనుభవాల ఆధారంగా, మీ కృషి, స్ఫూర్తి మరియు భావోద్వేగాలను నేను అభినందిస్తున్నాను. ఈ రోజు నేను మీ అందరికీ నమస్కరిస్తున్నాను” అని ప్రధాని అన్నారు. తనకు తానుగా సహాయం చేసుకునే సామర్థ్యం ఉన్నవారిని స్వయం సమృద్ధి అని పిలుస్తారు, అయితే ఇతరులకు అవసరమైన సమయంలో సహాయం చేసే సామర్థ్యం ఉన్నవారిని నిస్వార్థపరులు అని ప్రధాని నొక్కి చెప్పారు. ఇది వ్యక్తులకే కాకుండా దేశాలకు కూడా వర్తిస్తుందని అన్నారు. అందుకే గత కొన్నేళ్లుగా భారతదేశం తన స్వయం సమృద్ధితో పాటు నిస్వార్థతను పెంపొందించుకుంది. “తిరంగా’తో మనం ఎక్కడికైనా చేరుకుంటే, ఇప్పుడు భారత జట్లు వచ్చాయి, పరిస్థితి మెరుగుపడుతుందని అనే ఒక హామీ ఉంది, అని ఉక్రెయిన్‌లో తిరంగా పాత్రపై గుర్తు చేస్తూ ప్రధాని అన్నారు.

త్రివర్ణ పతాకానికి స్థానిక ప్రజలలో లభించిన గౌరవం గురించి కూడా ప్రధాని మాట్లాడారు. గంగా ఆపరేషన్ సమయంలో ఉక్రెయిన్‌లోని ప్రతి ఒక్కరికీ త్రివర్ణ పతాకం ఎలా కవచంగా పని చేసిందో కూడా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆపరేషన్ దేవిశక్తిలో ఆఫ్ఘనిస్తాన్ నుండి చాలా ప్రతికూల పరిస్థితులలో తరలింపులు జరిగాయి. కరోనా మహమ్మారి సమయంలో భారతదేశం ప్రతి పౌరుడిని ఇంటికి తిరిగి తీసుకువచ్చినప్పుడు మరియు మందులు మరియు వ్యాక్సిన్‌లను సరఫరా చేయడం ద్వారా ప్రపంచవ్యాప్త ఆదరణ పొందినప్పుడు అదే నిబద్ధత స్పష్టంగా కనిపించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 19 =