రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది? జియో ఫైబర్‌ కంటే బెటరేనా..!

What is Reliance Jio AirFiber and How Does it Work,What is Reliance Jio AirFiber,How Does it Work,How Does it Work Jio AirFiber,Mango News,Mango News Telugu,Reliance Jio AirFiber,What is Reliance Jio Air Fiber, Better than Jio Fiber, RIL, Basic infrastructure,Reliance Jio AirFiber Latest News,Reliance Jio AirFiber Latest Updates,Reliance Jio AirFiber Live News,Jio AirFiber Latest Updates,Jio AirFiber Live News

సెప్టెంబర్ 19, వినాయక చవితతో రోజు రిలయన్స్ జియో .. ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ 46 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

గత సంవత్సరం అదే జనరల్ యాన్యువల్ మీటింగ్‌లో రిలయన్స్ జియో ఫైబర్‌ను ప్రవేశపెట్టిన రిలయన్స్ సంస్థ.. ఈ ఏడాది జియో ఎయిర్ ఫైబర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రెండిటికి ఏం తేడాలున్నాయనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. కొత్త జియో ఫైబర్ ఎలా పనిచేస్తుంది. దీని వల్ల వినియోగదారులకు ఎలాంటి ఉపయోగాలున్నాయని అనుమానాలు వస్తున్నాయి.

నిజానికి జియో ఫైబర్ ఆప్టిక్ వైర్ టెక్నాలజీపైన ఆధారపడి ఉంటుంది. దీని ద్వారానే ఇంటర్నెట్ అందించడానికి, ఇల్లు లేదా ఆఫీస్‌లో కంపెనీ రూటర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. ఆ రూటర్‌కి ఆప్టిక్ వైర్‌ని తీసుకోవడం ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. దీని తర్వాత ఫైబర్ స్థిరమైన హై స్పీడ్ ఇంటర్నెట్‌ అందరికీ దొరుకుతుంది.అయితే దీనికి కొన్ని బేసిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అవసరం.

ఇప్పుడు కొత్త రాబోతోన్న జియో ఎయిర్ ఫైబర్ ద్వారా వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను రిలయన్స్ అందిస్తుంది. ఇది వైర్‌లెస్ డాంగిల్‌లాగా పనిచేస్తుంది. కానీ, దీని ఇంటర్నెట్ వేగం మాత్రం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. దీని కోసం ఎలాంటి బేసిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అవసరం లేదు.

జియో ఎయిర్ ఫైబర్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్ ఎయిర్ ఫైబర్ ద్వారా.. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అప్ అండ్ డౌన్స్ లేకుండా అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, ఇతర కంపెనీల ఆప్టిక్ వైర్ టెక్నాలజీ ద్వారా ఫైబర్ సిటీలకు పరిమితం చేశారు. అయితే జియో ఎయిర్ ఫైబర్ ఎలాంటి వైర్ లేకుండా ఇంటర్నెట్‌ను అందిస్తుంది. దీంతో సిటీలోనే కాదు మారుమూలలకు కూడా ఎయిర్ ఫైబర్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ సులభంగా చేరుకుంటుంది.

ఎయిర్ ఫైబర్ స్పెషాలటీ గురించి చెప్పాలంటే.. అది దాని పోర్టబిలిటీ. వినియోగదారులు దీన్ని ఏ ప్రదేశానికి అయినా తీసుకెళ్లి ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. అయితే, అక్కడ 5G కనెక్టివిటీ మాత్రం అందుబాటులో ఉండాలి. రిలయన్స్ జియో కంపెనీ చెబుతున్న దాని ప్రకారం, ఎయిర్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లాంటి స్పీడును అందించగలదు.

మరోవైపు ఇప్పటికే ఎయిర్‌టెల్ కంపెనీ మూడు వారాల క్రితం.. ఢిల్లీ, ముంబైకి ఎక్స్‌ట్రీమ్ ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్ ఫైబర్ వైఫై 5 రూటర్ కంటే 50% రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుందని రిలయన్స్ చెబుతోంది

దీంతో పాటు, దీనిలో విస్తృత కవరేజ్, స్పీడ్ డౌన్‌లోడ్ తో పాటు స్పీడ్ అప్‌లోడ్ సదుపాయాలు ఉంటాయి. అయితే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రిలయన్స్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా వెల్లడించలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + nine =