బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ కన్నుమూత

Actor Dilip Kumar Passed Away, Actor Dilip Kumar Passed Away at the Age of 98, Bollywood Legend Dilip Kumar Passes Away, Bollywood Legendary Actor Dilip Kumar, Bollywood Legendary Actor Dilip Kumar Passed Away at the Age of 98, Dilip Kumar, Dilip Kumar Death, Dilip Kumar Death News, Dilip Kumar dies at 98, Legendary actor Dilip Kumar dies at 98, Legendary Actor Dilip Kumar Passed Away, Legendary Indian actor dies, Mango News, Veteran actor Dilip Kumar passes away

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ 30న చికిత్స నిమిత్తం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున దిలీప్‌కుమార్‌ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. దిలీప్‌ కుమార్‌ మృతితో బాలీవుడ్ లో విషాదం నెలకుంది.

డిసెంబర్‌ 11, 2022న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో దిలీప్‌ కుమార్‌ జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌. 1944లో జ్వార్ భాటా అనే చిత్రంలో నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేశారు. సినిమాల్లో ఒక ప్రత్యేకమైన మెథడ్ యాక్టింగ్ టెక్నిక్‌ తో తక్కువ సమయంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో దిలీప్‌ కుమార్ 65 కి పైగా చిత్రాల్లో నటించారు. 1955 లో వచ్చిన ఆజాద్‌, దేవదాస్‌ సినిమాలతో దిలీప్ కుమార్ సంచలనం సృష్టించారు. అందాజ్, ఆన్, దాగ్, మొఘల్-ఇ-అజామ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్ చిత్రాల్లో ప్రత్యేక పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

మరోవైపు దిలీప్‌ కుమార్‌ అనేక అవార్డులను అందుకున్నారు. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న మొదటి నటుడుగా నిలిచారు. మొత్తం ఎనిమిదిసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. 1994లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. సినీరంగానికి దిలీప్‌ కుమార్‌ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2015లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో ఆయనను గౌరవించింది. ఇక 2000-2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా దిలీప్‌ కుమార్‌ సేవలందించారు. దిలీప్ కుమార్ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శాంటాక్రూజ్ ముంబయిలోని జుహు కబ్రాస్తాన్ లో బుధవారం సాయంత్రం 5:00 గంటలకు ఆయన అంత్యక్రియలు (ఖననం) జరపనున్నట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eleven =