17 ల‌క్ష‌లమంది విద్యార్థుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

CM Jagan over Safety of Students During Semester Exams, Lokesh urges Andhra CM, Lokesh urges Andhra CM to consider opinions of students, Mango News, Nara Lokesh, Nara Lokesh suggests caution on semester exams, Nara Lokesh Writes a Letter to CM Jagan, Nara Lokesh Writes a Letter to CM Jagan over Safety of Students, Nara Lokesh Writes a Letter to CM Jagan over Safety of Students During Semester Exams

రాష్ట్రంలో విద్యార్థుల‌కు సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. “17 ల‌క్ష‌ల మంది విద్యార్థుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాలి. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు పరీక్షా క్యాలెండర్లు విడుదల చేసినందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ వ‌ల్ల కోవిడ్ వ్యాప్తి చెంది మూడో దశ వ‌చ్చే ప్ర‌మాదం పొంచి ఉంది. రాష్ట్రంలో ఇంకా చాలా మంది విద్యార్థులు టీకా వేయించుకోలేదు. ఉన్నత విద్యలో సెమిస్టర్ సంవత్సరాంత పరీక్షలు ఎంతో ముఖ్యమైనప్పటికీ ల‌క్ష‌ల మందికి సామూహికంగా ఒకేసారి పరీక్షల నిర్వహణ చాలా ప్ర‌మాదం. ప్రత్యామ్నాయమార్గాన్ని ప్ర‌భుత్వం అన్వేషించాలి. డిగ్రీ, ఇంజ‌నీరింగ్ ప‌రీక్ష‌ల‌ నిర్వహణ వ‌ద్దంటూ కేరళ, కర్ణాటక, తెలంగాణలో విద్యార్థులు ఇప్పటికే నిరసనలు ప్రారంభించారు. ఆ ప‌రిస్థితిల ఏపీలో రాకుండా ప్ర‌భుత్వం ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని సీఎంను కోరాను” అని నారా లోకేష్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =