టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నేడే బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్ రెడ్డి

Mango News, MP Revanth Reddy, MP Revanth Reddy To Take Charge as New TPCC President, New Telangana PCC chief Revanth Reddy, Revanth Reddy appointed TPCC chief, Revanth Reddy new TPCC chief, Revanth Reddy to take charge as TPCC chief, Revanth to take charge as TPCC chief on July 7, Telangana Congress MP Revanth Reddy, TPCC New President A Revanth Reddy To Take Charge Of Office On July 7th, TPCC Revanth Reddy, TPCC Working President, TPCC Working President Revanth Reddy

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నేడే (జూలై 7, బుధవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రజాభివందనం చేస్తూ నాంపల్లి దర్గా మీదుగా గాంధీ భవన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:00 గంటలనుంచి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. టీపీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, టీ-కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఇప్పటికే పీసీసీ బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో గాంధీ భవన్ ను అలంకరించి, అన్ని ఏర్పాట్లు చేశారు.

పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన అనంతరం రేవంత్ రెడ్డి వరుసగా రాష్ట్రంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులను కలుసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిమంది అసంతృప్తి నేతలు మినహా కీలక నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ తో పాటుగా, ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్, పదిమంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, ప్రచార కమిటీ ఛైర్మన్, కన్వీనర్, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మరియు టీపీసీసీ యొక్క ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ నియామకాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇటీవలే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం బాధ్యతలను స్వీకరించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 4 =