బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ కు బెయిల్ మంజూరు

Aryan Khan Case, Aryan Khan Case LIVE, Aryan Khan Case News, Aryan Khan Drugs Case LIVE Updates, Aryan Khan granted bail in drugs case by Bombay High Court, Bombay HC grants bail to Aryan Khan, Bombay High Court, Bombay High Court grants bail to Aryan Khan, Bombay High Court Grants Bail to Shahrukh Khan’ Son, Bombay High Court Grants Bail to Shahrukh Khan’ Son Aryan Khan, Bombay High Court Grants Bail to Shahrukh Khan’ Son Aryan Khan in Narcotics-on-cruise Case, Narcotics-on-cruise Case, Shahrukh Khan’ Son Aryan Khan

ముంబయి సమీపంలో సముద్రంపై ఓ క్రూజ్ షిప్ లో జరుగుతున్న రేవ్ పార్టీ వ్య‌వ‌హారంలో అక్టోబర్ 2న బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ఎట్టకేలకు గురువారం నాడు ఆర్యన్‌ ఖాన్‌ కు బెయిల్ లభించింది. అక్టోబర్ 8 నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ తో పాటుగా అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్ మరియు మున్ముమ్ ధమేచాకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది.

ముందుగా ఆర్యన్‌ ఖాన్‌ కు బెయిల్ విషయంలో బాంబే హైకోర్టులో మూడురోజులుగా వాదనలు జరుగుతున్నాయి. ఆర్యన్‌ ఖాన్‌ తరఫున మాజీ ఏజీ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ దొరకలేదని ఆయన పలుమార్లు కోర్టుకు స్పష్టం చేశారు. అలాగే ఎన్సీబీ తరపున ఏఎస్జీ అనిల్ సింగ్ వాదనలు వినిపిస్తూ, ఆర్యన్ డ్రగ్స్ వాడాడని, అతని వాట్సాప్ చాట్‌ లలో అక్రమ డ్రగ్స్ లావాదేవీలకు సంబంధించి అతని ప్రమేయాన్ని వెల్లడించేలా వివరాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. సుదీర్ఘంగా పలు అంశాలపై ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం ఆర్యన్‌ ఖాన్‌ కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. పూర్తిస్థాయి బెయిల్ ఆర్డర్ రేపు ఇవ్వబడుతుందని, రేపు లేదా శనివారంలోగా ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బయటకు రానున్నట్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here