ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ

Actor Nagarjuna, Actor Nagarjuna Meets CM YS Jagan At Tadepalli Camp Office, Actor Nagarjuna Meets CM YS Jagan At Tadepalli Camp Office Today, Andhra Pradesh CM YS Jagan Mohan Reddy, Mango News, Nagarjuna, Nagarjuna meets AP CM Jagan on film industry issues, Nagarjuna meets AP CM YS Jagan, Nagarjuna Meets CM YS Jagan At Tadepalli Camp Office, Nagarjuna Movies, Tadepalli Camp Office, Tollywood actor Nagarjuna meets YS Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో గురువారం నాడు ప్రముఖ అగ్రనటుడు, కింగ్ అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎంను కలిసిన వారిలో నాగార్జునతో పాటుగా నిర్మాతలు ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై సీఎం వైఎస్ జగన్ తో నాగార్జున చర్చించినట్టు సమాచారం. అలాగే సీఎంతో కలిసి నాగార్జున భోజనం చేసినట్లు తెలుస్తుంది. ఇటీవలే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సినీ నిర్మాతల మధ్య రెండు సార్లు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నాగార్జున సీఎం వైఎస్ జగన్ తో భేటీ కావడం ప్రాధానత్య సంతరించుకుంది. అయితే ఈ భేటీ వ్యక్తిగతమా, సినీ పరిశ్రమ అంశాలపై చర్చించారా అనేది తెలియాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here