‘బైజూస్’ సీఈవో ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘ‌న‌ల‌ ఆరోప‌ణ‌లపై నజర్

ED Conducted Raids Over Byjus CEO Raveendran Residence and Office Investigation on For FEMA Violations,ED Conducted Raids Over Byjus CEO Raveendran,Raids Over Byjus CEO Raveendran Residence and Office,Investigation on For FEMA Violations,CEO Raveendran Investigation on For FEMA Violations,Mango News,Mango News Telugu,ED conducts searches at home,ED searches three premises of Byju CEO Raveendran,ED raids Byjus CEO Raveendran,BYJUs CEO Raveendrans offices searched by ED,ED conducts raid at Byjus offices,BYJUs CEO Raveendran Latest News,BYJUs CEO Raveendran Latest Updates,CEO Raveendran ED Raids Latest News,CEO Raveendran ED Raids Latest Updates

ఆన్‌లైన్ విద్యాకోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థ బైజూస్ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. శనివారం బెంగళూరులోని బైజూస్ సీఈవో రవీంద్రన్ బైజు నివాసం మరియు కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ మేరకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలకు సంబంధించి బైజూస్ పై ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ ప్రకటించింది. మొత్తం మూడు ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు చేసి వివిధ నేరారోపణ పత్రాలు మరియు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. అయితే దీనికి సంబంధించి రవీంద్రన్ బైజుకు ఇప్పటికే అనేకసార్లు సమన్లు ​​జారీ చేయబడ్డాయని, అయితే అతను ఈడీ ముందు హాజరుకాలేదని స్పష్టం చేసింది.

కాగా విదేశీ మారక ద్రవ్యం వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు రవీంద్రన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. 2011-2023 మధ్య కాలంలో దాదాపు రూ. 28,000 కోట్ల మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందిందని, అయితే దీనికి సంబంధించిన లెక్కల వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదని తెలుస్తోంది. అలాగే ఇదే కాలంలో కొన్ని విదేశీ కంపెనీల‌కు సుమారు 9,754 కోట్లను ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొతో కొన్ని విదేశీ సంస్థల ఖాతాలకు రెమిట్ చేసిన‌ట్లు కూడా బైజూస్‌పై ఆరోప‌ణ‌లు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈడీ నేడు ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇక మరోవైపు గత కొంత కాలంగా బైజూస్ తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. బెంగళూరు ప్రధాన కార్యాలయ సంస్థ దాదాపు రూ. 4,500 కోట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 3 =