దేశంలోనే అత్యధిక ఆస్తులు కల్గిన పార్టీగా నిలిచిన బీజేపీ

bjp, BJP is The India’s Richest Political Party, BJP is The India’s Richest Political Party in 2019-20, BJP is The India’s Richest Political Party in 2019-20 with Assets, BJP is The India’s Richest Political Party in 2019-20 with Assets of More Than Rs 4, BJP is The India’s Richest Political Party in 2019-20 with Assets of More Than Rs 4800 Crore, BJP Is The Richest Political Party, BJP Is The Richest Political Party In 2019-20, bjp party, BJP richest party in India, BJP was richest political party in India, BJP was richest political party in India in 2019-2020, Mango News

2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తులను, అప్పులను అధ్యయనం చేసిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ADR) నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఆర్థికంగా అత్యధిక సంపన్న పార్టీగా తేల్చింది. ఆస్తుల విషయంలో మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటింది. బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరం తన ఆర్థిక బలాన్ని మరింతగా పెంచుకుంటోందని తాజా నివేదిక స్పష్టం చేసింది.

ఈ నివేదిక విశ్లేషణ ప్రకారం, ప్రస్తుత కాలంలో ఏడు జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తులు రూ.6,988.57 కోట్లు. అలాగే, 44 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులు రూ.2,129.38 కోట్లు. కాంగ్రెస్‌ పార్టీకి 588 కోట్ల 16 లక్షల రూపాయలు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. ప్రాంతీయ పార్టీలలో సమాజ్‌వాదీ పార్టీ గరిష్టంగా రూ.563.47 కోట్లు ఆస్తులను ప్రకటించింది. దీని తర్వాత టీఆర్ఎస్ రూ.301.47 కోట్లు, ఏఐఏడీఎంకే రూ.267.61 కోట్ల ఆస్తులను ప్రకటించింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ 4 వేల 847 కోట్ల 78 లక్షల రూపాయల విలువైన ఆస్తులను ప్రకటించింది. కాంగ్రెస్‌తో పోలిస్తే కాషాయ పార్టీ ఆస్తుల విలువ ఏకంగా 8 రెట్లపైనే ఉంది. ADR నివేదిక ప్రకారం 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల విలువ 6 వేల 988 కోట్ల 57 లక్షల రూపాయలు. ఇక 44 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువ 2,129 కోట్ల 38 లక్షల రూపాయలు. ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో బీజేపీదే దాదాపు 70 శాతం. ఆ తర్వాత 698 కోట్ల 33 లక్షల రూపాయల ఆస్తులతో బహుజన్‌ సమాజ్‌ పార్టీ రెండో స్థానంలో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here