పార్లమెంట్​లో అదానీ వ్యవహారంపై రగడ.. చర్చకు ప్రతిపక్షాల పట్టు, ఉభయ సభలు సోమవారానికి వాయిదా

Argument On Adani Case In Parliament,Both Houses Adjourned To Monday,Adani Case In Parliament,Mango News,Mango News Telugu,Adani Group Companies,Mango News,Adani Gas Share Price,Adani Career,Adani Cement,Adani Electricity,Adani Electricity Bill,Adani Electricity Bill Payment,Adani Enterprises,Adani Enterprises Share Price,Adani Gas,Adani Green Share Price,Adani One,Adani Port Share Price,Adani Power,Adani Power Share Price,Adani Wilmar Share Price,Gautam Adani,Gautam Adani Net Worth

అదానీ వివాదంపై ఈరోజు మళ్లీ గందరగోళం చెలరేగడంతో లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ సభా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ వెల్లడించిన నివేదిక మరియు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు భారీగా క్షీణించడంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ సమావేశాలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ లేదా సుప్రీం కోర్టు పర్యవేక్షణ ప్యానెల్‌తో విచారణ జరిపించాలని కూడా వారు కోరారు. అయితే ఛైర్మన్‌ మరియు స్పీకర్ ఇరువురూ అందుకు సమ్మతించకపోవడంతో వెల్ లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో ఉభయ సభలు ఉదయం ఒకసారి వాయిదా పడగా, మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన తర్వాత మరోసారి సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇక సభ వెల్‌లోకి దూసుకెళ్లిన వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ హెచ్చరించారు. కాగా అంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఛాంబర్‌లో 16 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఆప్‌, ఆర్జేడీ, జేడీయూ, సీపీఎం, సీపీఐ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. వ్యాపారవేత్త అదానీకి బీజేపీ ప్రభుత్వం అయాచితంగా లబ్ది చేకూరుస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here