2007 టీ20 వరల్డ్‌ కప్ టీమిండియా స్టార్ జోగిందర్ శర్మ కీలక నిర్ణయం, క్రికెట్‌కు గుడ్ బై

2007 T20 World Cup Team India Star Joginder Sharma Announces Retirement From All Forms of Cricket,2007 T20 World Cup,Team India Star Joginder Sharma,Joginder Sharma Announces Retirement,Mango News,Mango News Telugu,Joginder Sharma Net Worth,Joginder Sharma Wife,Joginder Sharma Salary,Joginder Sharma Current Job,Joginder Sharma Education Qualification,Joginder Sharma,Joginder Sharma Stats,Joginder Sharma Instagram,Joginder Sharma Last Over,Joginder Sharma Ipl,Joginder Sharma Wikipedia,Joginder Sharma Police

2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇండియా స్టార్ జోగిందర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు (బీసీసీఐ) కార్యదర్శికి రాసిన లేఖ ద్వారా తెలిపారు. అందులో.. ‘తనకు అందించిన అవకాశాలకు బోర్డు, హర్యానా క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్ మరియు హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఈ రోజు, అపారమైన కృతజ్ఞత మరియు వినయంతో, నేను అన్ని రకాల అంతర్జాతీయ & దేశీయ క్రికెట్‌ల నుండి నా రిటైర్మెంట్‌ను ప్రకటించాను. 2002-2017 వరకు నా ప్రయాణం నా జీవితంలో అత్యంత అద్భుతమైన సంవత్సరాలు, ఎందుకంటే అత్యున్నత స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉంది. బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్ మరియు హర్యానా ప్రభుత్వం నాకు అందించిన అవకాశాలకు నేను కృతజ్ఞుడను’ అని జోగిందర్ లేఖలో పేర్కొన్నాడు. కాగా 39 ఏళ్ల శర్మ ప్రస్తుతం హర్యానా పోలీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు.

ఇక 2007 ప్రపంచ కప్‌ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించడంలో పేసర్ జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవరే కారణమంటే అతిశయోక్తి కాదు. వివరాల్లోకి వెళ్తే.. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫలితం చివరి ఓవర్‌ వరకు సాగింది. ఆ సమయంలో తీవ్ర ఉత్కంఠ మధ్య కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా జోగిందర్ శర్మకు చివరి ఓవర్ వేసే అవకాశం ఇచ్చాడు. అప్పటికే నిలదొక్కుకున్న పాకిస్థాన్ కీలక బ్యాటర్ మిస్బా-ఉల్-హక్, చివరి వికెట్ మహ్మద్ ఆసిఫ్‌లతో కలిసి క్రీజులో ఉన్నాడు. చివరి ఓవర్లో విజయ సమీకరణం 13 పరుగులు కాగా.. మొదటి 2 బంతుల్లో ఏడు పరుగులు లభించాయి. ఆ తర్వాత మిస్బా-ఉల్-హక్ అద్భుత బ్యాటింగ్ తో 2 బంతుల్లో ఫోర్ సహా మరో 6 పరుగులు సాధించాడు. దీంతో మరో 2 బంతులు మిగులుండగానే స్కోరు సమం అయింది. ఈ సమయంలో జోగిందర్ మిస్బాను తెలివిగా బోల్తా కొట్టించాడు. ఐదో బంతిని స్కూప్ షాట్‌ ఆడే క్రమంలో షార్ట్ ఫైన్-లెగ్ వద్ద శ్రీశాంత్ క్యాచ్ అందుకోవడంతో మిస్బా అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసి అందులో భారత్ విజయం సాధించడం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here