బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సీబీఐ దర్యాప్తు, హైకోర్టు ఆదేశాలు

Bengal post-poll violence, Bengal post-poll violence news, Calcutta HC orders CBI SIT probe, Calcutta High Court, Calcutta High Court Orders CBI Probe, Calcutta High Court orders CBI probe into murder rape cases, Calcutta High Court Orders CBI Probe Into West Bengal Post-Poll Violence Cases, Mango News, Post-poll violence, Post-poll violence In Bengal, West Bengal post-poll violence, West Bengal Post-Poll Violence Cases

కలకత్తా హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన కేసుల దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కి అప్పగించింది. అలాగే ఇతర హింసాత్మక ఘటనలు, నేరాలపై బెంగాల్ పోలీసు బృందంతో ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సిట్ లో సభ్యులుగా ఐపీఎస్ అధికారి సుమన్ బాల సాహూ, కోల్‌కతా పోలీసు కమిషనర్ సౌమెన్ మిత్రా, మరో సీనియర్ అధికారి రణవీర్ కుమార్ ఉండనున్నారు.

సిట్ దర్యాప్తు పురోగతిని కోర్టు ట్రాక్ చేస్తుందని తెలిపారు. అలాగే ఆరు వారాల్లో నివేదికలను సమర్పించాలని సీబీఐ, సిట్ లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ కేసులపై రాష్ట్ర పోలీసులు జరిపిన విచారణ రికార్డ్స్ ను సీబీఐకి అప్పగించాలని కోర్టు సూచించింది. కాగా ఈ తీర్పుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అసంతృప్తిని వ్యక్తం చేసింది, ఈ తీర్పుపై బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కోర్టు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 17 =