సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తొమ్మిది మంది పేర్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు

3 women judges among 9 recommended by Collegium, 8 High Court CJ/Judges Advocate as Judges in Supreme Court, Advocate as Judges in Supreme Court, Collegium recommends 8 High Court judges, Collegium recommends 9 names as Supreme Court judges, Collegium Resolutions, latest news on appointment of high court judges, Mango News, Supreme Court Collegium, supreme court collegium news today, Supreme Court Collegium Recommends 8 High Court CJ/Judges, Supreme Court Collegium Recommends 8 High Court CJ/Judges Advocate as Judges in Supreme Court, supreme court judges list, supreme court judges list names

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం నాడు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం తొమ్మిది పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమై ఈ నియామకాలపై చర్చించింది. అనంతరం 9 మందిని (హైకోర్టు చీఫ్ జస్టిస్/జడ్జి, బార్ మెంబెర్) సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమాకాలకై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తునట్టు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు హైకోర్టు మహిళా జడ్జిలు ఉన్నారు.

సుప్రీంకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన వారి వివరాలు:

  • జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా – చీఫ్ జస్టిస్ కర్ణాటక హైకోర్టు
  • జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ – చీఫ్ జస్టిస్ గుజరాత్ హైకోర్టు
  • జస్టిస్‌ జేకే మహేశ్వరి – చీఫ్ జస్టిస్ సిక్కిం హైకోర్టు
  • జస్టిస్‌ హిమా కోహ్లి – చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు
  • జస్టిస్‌ బీవీ నాగరత్న – జడ్జి కర్ణాటక హైకోర్టు
  • జస్టిస్‌ సీటీ రవికుమార్‌ – జడ్జి కేరళ హైకోర్టు
  • జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ – జడ్జి మద్రాస్ హైకోర్టు
  • జస్టిస్‌ బేలా ఎం.త్రివేది – జడ్జి గుజరాత్ హైకోర్టు
  • పీఎస్‌ నరసింహ – సీనియర్ అడ్వకేట్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =