63 వేల ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీల కంప్యూటరీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Centre Approves Computerization of 63000 Primary Agricultural Credit Societies with Budget of Rs 2516 Cr, Centre decided to computerise all functional 63000 PACS over the next five years, computerise all functional 63000 PACS over the next five years, functional 63000 PACS, Computerization of 63000 Primary Agricultural Credit Societies, Primary Agricultural Credit Societies, next five years, 63000 PACS, PM Modi government approved Rs 2516 crore plan to computerise all the around 63000 functional PACS over the next five years, PACS, Primary Agricultural Credit Societies News, Primary Agricultural Credit Societies Latest News, Primary Agricultural Credit Societies Latest Updates, Primary Agricultural Credit Societies Live Updates, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 63 వేల ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలు (పీఏసీఎస్)/ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. పీఏసీఎస్ ల యొక్క సామర్థ్యాన్ని పెంచడం, వాటి కార్యకలాపాలలో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావాలనే లక్ష్యంతో కంప్యూటరీకరణను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పీఏసీఎస్ లు వారి వ్యాపారాన్ని విస్తరించేందుకు మరియు పలు కార్యకలాపాలు/సేవలను చేపట్టేందుకు కంప్యూటరీకరణ దోహదపడనుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 5 సంవత్సరాల వ్యవధిలో సుమారు 63,000 ఫంక్షనల్ పీఏసీఎస్ ల యొక్క కంప్యూటరీకరణను జరగనుంది. దీని మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2516 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1528 కోట్లు అని తెలిపారు.

రాష్ట్ర సహకార బ్యాంకులు (ఎస్‌టిసిబిలు), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డిసిసిబిలు) ఇప్పటికే నాబార్డ్ ద్వారా ఆటోమేటెడ్ గా మార్చబడ్డాయి మరియు కామన్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ (సీబీఎస్)లోకి తీసుకురాబడ్డాయి. కానీ చాలా వరకు మూడో అంచె అయిన పీఏసీఎస్ లు ఇప్పటివరకు కంప్యూటరీకరణ చేయబడలేదు, ఇప్పటికీ మాన్యువల్‌గా పని చేయడం వల్ల అసమర్థత మరియు విశ్వసనీయత లోటు ఏర్పడింది. కొన్ని రాష్ట్రాల్లో పీఏసీఎస్ యొక్క స్టాండ్ అలోన్ మరియు పాక్షిక కంప్యూటరీకరణ జరిగింది. అయితే వారు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో యూనిఫామిటీ లేదని, అవి డిసిసిబిలు మరియు ఎస్‌టిసిబిలతో పరస్పరం అనుసంధానించబడలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పీఏసీఎస్ లను కంప్యూటరీకరించాలని, జాతీయ స్థాయిలో ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావాలని మరియు వారి రోజువారీ బిజినెస్ కోసం కామన్ అకౌంటింగ్ సిస్టమ్ (సీఏఎస్)ని కలిగి ఉండాలని ప్రతిపాదించబడింది. ఈ నేపథ్యంలోనే పీఏసీఎస్ ల కంప్యూటరీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =