ఏప్రిల్ నెలలో అన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం

Centre Decided to Operate Covid Vaccination on All Days of April Month in Public, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid Vaccination on All Days of April Month in Public and Private Hospitals, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Private Hospitals, Vaccine Distribution

దేశవ్యాప్తంగా నేటి నుంచి (ఏప్రిల్ 1, గురువారం) 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ‌ను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూడోవిడతలో భాగంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కరోనా వ్యాక్సిన్ కేంద్రాల్లో ఏప్రిల్ నెలలో అన్ని రోజులలో (ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు) వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు/కేంద్రప్రభుత్వ ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. ఏప్రిల్ నెలలో గెజిటెడ్ సెలవులతో సహా నెలలోని అన్ని రోజులలో వ్యాక్సిన్ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

దేశంలో కరోనా వలన అత్యంత ఎక్కువుగా ప్రభావితమయ్యే జనాభా సమూహాలను రక్షించడానికి ఒక సాధనంగా వ్యాక్సిన్ కార్యక్రమం సాగుతుందని, ఈ పక్రియను మరింత వేగవంతం చేసేందుకే అన్ని రోజులు పంపిణీ జరిగేలా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఏప్రిల్ 1, గురువారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 6.5 కోట్లు (6,51,17,896) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 18 =