మార్చిలో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అధికం

Goods and Services Tax, GST Revenue, GST Revenue Collection, GST revenue collection 2021, GST revenue collection March, GST revenue collection March Month, GST Revenue Collection News, GST Revenue Collection Updates, Mango News, March Month Reports Record Level of Rs 123902 Crore, Revenue collection, Revenue collection for March’ 21 sets new record

దేశంలో మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. మార్చి నెలలో మొత్తం రూ.1,23,902 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని, గత జనవరి నెలలో వసూలైన రూ.1,19,847 కోట్లను దాటి జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత భారీగా వసూలు కావడం ఇదే తొలిసారని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెలలో కూడా లక్ష కోట్లు దాటడం కరోనా మహమ్మారి పరిస్థితుల అనంతరం దేశంలో వేగంగా మారుతున్న ఆర్థిక రికవరీకి స్పష్టమైన సూచికని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది.

మార్చిలో సీజీఎస్టీ వసూళ్లు రూ.22,973 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ. 29,329 కోట్లు, ఐజీఎస్టీ రూ.62,842 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.31,097 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.8,757 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.935 కోట్లతో కలిపి) వసూలు అయ్యాయి. మరోవైపు లాక్ డౌన్ అనంతరం అక్టోబర్-2020 లో (రూ.1,05,155 కోట్లు), నవంబర్-2020 లో(రూ.1,04,963 కోట్లు), డిసెంబర్-2020 లో (రూ.1,15,174 కోట్లు), జనవరి-2021 లో (రూ.1,18,875 కోట్లు), ఫిబ్రవరి నెలలో (రూ.1,13,143) జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =