బయోలాజికల్-ఇ సంస్థతో 30 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్రం ఒప్పందం

Biological-E, Biological-E COVID-19 vaccines, Biological-E Gets Deal With Centre, Biological-E to Reserve 30 Crore of Covid Vaccine Doses, Centre finalises advance agreement with Biological E, Centre finalises deal with Hyderabad-based firm, Centre has Finalised Arrangements with Biological-E, Centre has Finalised Arrangements with Biological-E to Reserve 30 Crore of Covid Vaccine Doses, Centre reserves 30-crore doses of Biological E, Centre signs deal with Biological-E, COVID 19 Vaccine, Health ministry buys 30 cr COVID-19 vaccine doses, Mango News

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను రిజర్వ్ చేయడానికి హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ లిమిటెడ్ తో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందస్తు ఏర్పాట్లను ఖరారు చేసింది. ఇందుకోసం బయోలాజికల్-ఇ సంస్థకు కేంద్ర ఆరోగ్య శాఖ రూ.1500 కోట్లు ముందస్తుగా చెల్లించనుంది. 30 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఆగస్టు 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు బయోలాజికల్-ఇ సంస్థ తయారు చేసి నిల్వ చేస్తుందని పేర్కొన్నారు.

పేజ్ 1 మరియు పేజ్ 2 క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలను చూపించిన తరువాత బయోలాజికల్-ఇ తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటుందని చెప్పారు. బయోలాజికల్-ఇ చేత అభివృద్ధి చేయబడిన వ్యాక్సిన్ ఒక ఆర్బిడి ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్ అని, ఇది రాబోయే కొద్ది నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయ వ్యాక్సిన్ తయారీదారులకు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లో సహాయం మరియు ఆర్థిక సహాయాన్ని అందించి ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందం జరిగినట్టు పేర్కొన్నారు. బయోలాజికల్-ఇ కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రీక్లినికల్ స్టేజ్ నుండి ఫేజ్-3 అధ్యయనాల వరకు కేంద్రం మద్దతు ఇచ్చిందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =