టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా

Eatala Rajender Join BJP, Eatala Rajender Might Join BJP, Eatala Rajender To Join BJP, Etala Rajender, Etala Rajender Resigns To TRS Party, Etala Rajender Resigns To TRS Party And MLA Post, Etela Rajender Resigned To TRS Party And Huzurabad MLA, Etela Rajender Resigns To TRS, Etela resigns to TRS & MLA post, Former Telangana minister Etela Rajender, Former Telangana minister Etela Rajender to join BJP, Mango News, National President of the BJP

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. శుక్రవారం ఉదయం శామీర్ పేట్ లోని తన నివాసం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలపై కనీసం తన వివరణ తీసుకోకుండానే, రాత్రికి రాత్రే విచారణ చేసి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని అన్నారు. గతంలో కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు రాజీనామా చేశానని అన్నారు. ఆ సందర్భాల్లో రాజీనామా చేసి పోటీచేసినప్పుడు ఒకసారి ఏడుగురు, మరోసారి పది మంది గెలిచారని వారిలో తానున్నానని అన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా గెలిచానని, ఈ రోజు తనకు ఏర్పడ్డ పరిస్థితులు చూసి ప్రజలు బాధపడుతున్నారని ఈటల పేర్కొన్నారు. టీఆర్ఎస్‌ తో తాను కొనసాగించిన 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నానని, కష్టాలు ఎన్ని వచ్చిన ఎదుర్కొంటానని, ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోనని ఈటల రాజేందర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 6 =