రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను విడుదల చేసిన కేంద్రం

Centre Released Rs.8873 Crore SDRF Installment to States in Advance Amid Covid-19 Surge,Mango News,Mango News Telugu,Centre Releases Rs 8873 Crore To States From Disaster Fund Amid COVID-19 Surge,Centre Releases First Instalment Of Rs 8873 Crore Under State Disaster Response Fund To States,Centre Releases First Instalment Of Rs 8873 Crore,Centre Released Rs.8873 Crore SDRF Installment,SDRF Installment,Centre Released Rs.8873 Crore,Covid-19,Covid-19 Surge,Covid-19 Second Wave,Covid-19 Updates,Covid-19 Latest Updates

కేంద్రప్రభుత్వం శనివారం నాడు 22 రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను విడుదల చేసింది. కేంద్ర హోమ్ శాఖ సిఫారసు మేరకు 2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) యొక్క సెంట్రల్ షేర్ 1వ విడతను సాధారణ షెడ్యూల్‌ కంటే ముందుగానే కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. సాధారణంగా ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం జూన్ నెలలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ యొక్క మొదటి విడత నిధులు విడుదల అవుతాయి. అయితే ఈసారి గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించిన మొత్తానికి వినియోగ ధృవీకరణ పత్రం కోసం చూడకుండా ఈ నిధులను విడుదల చేశారు.

కాగా కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఆయా రాష్ట్రాలకు చేరే మొత్తంలో 50 శాతం వరకు (రూ.4436.8 కోట్లు) కోవిడ్-19 నియంత్రణ చర్యల కోసం రాష్ట్రాలు ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు. ఆస్పత్రుల కోసం, వెంటిలేటర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, అంబులెన్స్ సేవలను బలోపేతం చేయడం, కోవిడ్-19 ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ ఉత్పత్తి మరియు నిల్వ ప్లాంట్ల కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుండి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =