ఆఖరి క్షణాల వరకు సజావుగా చంద్రయాన్-2

chandrayaan 2 satellite latest news, Chandrayaan2-Isro chief Sivan confirms communication lost with Vikram lander, indian space research organisation, ISRO About Chandrayaan 2 Satellite, Isro chief Sivan confirms communication lost with Vikram lander, ISRO lost communication with Chandrayaan 2’s Vikram Lander, lost connection with Vikram lander, PM Modi Consoles ISRO Scientists, PM Narendra Modi Consoles ISRO Scientists, Vikram lander

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగింది. ప్రయోగం జరిగిన నాటినుండి దేశమంతా చంద్రయాన్-2 పట్ల ఆసక్తి కనబరిచింది. అనేక దశల్లో చంద్రయాన్-2 ను సరైన కక్ష్యలోకి ప్రవేశ పెడుతూ శాస్త్రవేత్తలు అద్భుతమైన కృషి చేసారు. ఇక తుది దశకు చేరుకోవడంతో శుక్రవారం అర్ధరాత్రి 1.30 నుంచి 2.30 గంటల మధ్య ఆర్బిటర్ నుంచి ముందే విడిపోయిన ల్యాండర్ విక్రమ్ ల్యాండ్ అయ్యే అవకాశం అవకాశముందని ముందుగానే ప్రకటించడంతో ప్రజలంతా టీవీలలో వీక్షించడానికి సిద్ధమయ్యారు. ఇక అన్ని అనుకునట్టు కొనసాగి నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. చంద్రుని ఉపరితలానికి 2.1 కి.మీ ఎత్తు వరకు ల్యాండర్ పయనం సవ్యంగానే సాగింది, కొన్ని క్షణాల్లోనే అక్కడి నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి.ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూసారు, సంకేతాల కోసం కొద్దిసేపు వేచిచూసిన శాస్త్రవేత్తలు ఫలితం లేకపోవడంతో నిరాశ చెందారు.

ఇస్రో ఛైర్మన్ కె.శివన్ మరికొంత మంది శాస్త్రవేత్తలతో కలిసి, అక్కడే ల్యాండింగ్ ను స్వయంగా వీక్షిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. తరువాత 2.1 కి.మీ వరకు అంతా సరైన పద్ధతిలోనే జరిగింది. ఆ తరువాత ల్యాండర్ నుంచి భూకేంద్రానికి సంకేతాలు స్తంభించిపోయాయి. సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నాం అని ఛైర్మన్ శివన్ ప్రకటించారు. ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. భవిష్యత్ లో ఇంకా గొప్ప విజయాలు అందుకుంటారనే నమ్మకం మీ మీద ఈ దేశ ప్రజలకుందని వారిలో స్ఫూర్తి నింపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here