కంటతడిపెట్టిన ఇస్రో ఛైర్మన్ శివన్, ఓదార్చిన మోడీ

chandrayaan 2 satellite latest news, indian space research organisation, ISRO About Chandrayaan 2 Satellite, ISRO lost communication with Chandrayaan 2’s Vikram Lander, lost connection with Vikram lander, Mango News Telugu, Modi Consoles ISRO Scientists, PM Modi Consoles ISRO Scientists, PM Narendra Modi Consoles An Emotional ISRO Chief Sivan, PM Narendra Modi Consoles ISRO Scientists, Vikram lander

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడం దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. అనేక మంది శాస్త్రవేత్తలతో చంద్రయాన్-2 ప్రయోగానికి విశేమైన కృషి చేసిన ఇస్రో ఛైర్మన్ కె. శివన్, ల్యాండర్ తో చివరి క్షణాల్లో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మిషన్ ప్రారంభం నుంచి తీవ్రంగా కష్టపడి ఇస్రో ప్రతిభను, భారతదేశ ప్రతిష్టను మరింతపెంచే అవకాశం చేజారడంతో శివన్ వేదనకు గురై కంటతడి పెట్టుకున్నారు. ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను ఉద్దేశించి చంద్రయాన్-2 అంశంపై ఇస్రో టెలిమెట్రీ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్‌)లో ప్రసంగించి తిరుగుపయనమవుతుండగా ఆయన్ను కలిసిన శివన్ తీవ్ర భావోద్వేగానికి గురై తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. శివన్ స్థితిని గమనించిన ప్రధాని మోడీ, ఆయనను గుండెలకు హత్తుకుని ఓదార్చారు. ఆయన వెన్నుతడుతూ ధైర్యం చెప్పారు.

ఈ పరిణామాలు అనంతరం సోషల్ మీడియాలో ఇస్రో శాస్త్రవేత్తలకు, శివన్ కు పెద్దఎత్తున మద్ధతు లభిస్తుంది. శివన్ కంట తడి పెట్టుకున్న వీడియోకు స్పందిస్తూ మీ అంకిత భావానికి, కఠోరమైన శ్రమకు భారతదేశం గర్విస్తుందని, అధైర్యపడకుండా ముందుకు సాగాలని దేశ పౌరులంతా మిమ్మల్ని చూసి గర్విస్తున్నారని ఉద్వేగపూరితంగా కామెంట్లు పెడుతున్నారు. ముందుగా శాస్త్రవేత్తలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ సైతం శాస్త్రవేత్తల కష్టం వృధాకాదని, అధైర్యపడకుండా భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలు చేయాలనీ ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =