దేశంలో అక్కడక్కడా వెలుగుచూస్తున్న బాల్యవివాహాలు

child marriage act in india, child marriage in india 2021, Child marriage is a bane in India, Child marriage is still rampant in India, Child Marriages, child marriages are rampant in north india, Child Marriages Are Still Rampant, Child Marriages Are Still Rampant In India, Child Marriages Are Still Rampant In The Country, Child Marriages In India, Child Marriages In The Country, Child marriages still rampant, Mango News, Mango News Telugu, national news

మన దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు, ప్రయోగాలు జరిగాయి.. ఇంకా జరుగుతున్నాయి. ప్రజల జీవన శైలి, నాగరికతల విషయంలో కూడా దేశం అభివృద్ధిపథంలో పయనిస్తోంది. కానీ, ఇదంతా ఒక వైపు మాత్రమే.. మరొకవైపు చూస్తే, ఇంత అభివృద్ధి చెందిన 21వ శతాబ్దంలో కూడా మన దేశంలోని కొన్ని ప్రాంతాలలోని ప్రజలు మాత్రం ఇంకా పూర్వకాలంలోని మూఢాచారాలనే నమ్ముతున్నారు. బాల్య వివాహాలు వంటి అనాగరిక పద్ధతులనే పాటిస్తున్నారు. చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసే సంప్రదాయం ఇంకా మనదేశంలో అక్కడక్కడా వెలుగు చూస్తోంది. వివరాలలోకి వెళ్తే…

రాజస్థాన్ రాష్ట్రం లోని చిత్తోర్ ఘర్ లో 9వ తరగతి చదువుతున్న ఒక బాలిక తన పెళ్లి ఆపాలంటూ బాలల హక్కుల పరిరక్షణ సమితి హెల్ప్ లైన్ ను సంప్రదించింది. సంబంధిత అధికారులు ఆ పాప చెప్పిన విషయం విని వెంటనే స్పందించారు. లోకల్ పోలీసుల సహకారంతో బాలిక గ్రామానికి చేరుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులను నిలదీయగా వారు అసలు విషయం వివరించారు. డిసెంబర్ 11న ఆ బాలికకు వివాహం నిర్ణయించినట్లు తెలిపారు. కానీ, తమకు కూడా ఈ వివాహం ఇష్టం లేదని, బాలిక మేనత్త, తాత ఒత్తిడి వలననే తాము కూడా వివాహానికి అంగీకరించినట్లు తెలిపారు. మందలించిన అధికారులు ఆ బాలికని మంచిగా చదివించాలని సూచించారు. మైనార్టీ తీరకుండా వివాహం చేస్తే చట్టప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు. అంగీకరించిన తల్లిదండ్రులు బాలికను చదివించటానికి ఒప్పుకున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =