తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

Air Force chopper crash, Air Force helicopter, CDS Bipin Rawat’s chopper crashes in Tamil Nadu, CDS Gen Bipin Rawat’s chopper crashes in Tamil Nadu, Chopper carrying Chief of Defence Staff General Bipin Rawat crashes, Helicopter with Chief of Defence Staff crashes, Helicopter With General Bipin Rawat Crashes, IAF helicopter with CDS Bipin Rawat on board crashes, IAF helicopter with Gen Bipin Rawat on board crashes, IAF Helicopter With General Bipin Rawat Crashes, IAF Helicopter With General Bipin Rawat Crashes In Tamil Nadu, Indian Army helicopter crashes in Tamil Nadu, Mango News, MangoNews, Tamil nadu

డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు వద్ద నీలగిరి కొండల్లో కుప్పకూలింది. హెలికాప్టర్ లో రావత్ తో పాటు ఇంకో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9 మందిలో కొందరు ప్రమాద స్థలంలోనే మరణించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపిస్తున్నాయి. మృతదేహాలు వెలికి తీస్తున్నారు. కోయంబత్తూర్ నుంచి వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ అధికారులు విచారణకు ఆదేశించారు.

డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రధాని అధ్యక్షతన ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. భేటీలో ఉన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని అడిగి వివరాలు తెలుసుకున్న ప్రధాని, వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here