57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ – ప్రపంచ ఆరోగ్య సంస్థ

Omicron Spreads Over 57 Countries World Health Organization,Omicron Spreads Over 57 Countries, World Health Organization,Omicron reported in 57 countries,Coronavirus digest,Omicron variant reported in 57 countriesOmicron Covid-19 variant,WHO,Omicron strain detected in 57 countries,

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ ఇప్పటివరకు 57 దేశాలకు విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తెలిపింది. ఇది రోజు రోజుకు తన పరిధిని పెంచుకుంటూ ఎక్కువ దేశాలకు వ్యాపిస్తున్నట్లు తెలియజేసింది. వీటిలో ఎక్కువ కేసులు ప్రయాణాల వలనే నమోదవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేరియెంట్ మొదటగా వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, అరబ్ దేశాలు, పశ్చిమ దేశాలలో కూడా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

తాజాగా ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ వేరియెంట్ లో కొత్తరకం వైరస్ ని అక్కడి వైద్యులు గుర్తించారు. ఈ మధ్య దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ వచ్చిన ఓ ప్రయాణికుడిని పరీక్షించగా ఈ కొత్తరకం వైరస్ వెలుగుచూసినట్లు తెలిసింది. అతడిని ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి చికిత్సను అందిస్తోంది ఆస్ట్రేలియా వైద్య బృందం. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియెంట్ గుబులు పుట్టిస్తుండగా మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్తరకం వెలుగుచూడటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే విషయమే. అన్ని దేశాలు వీలైనంత వేగంగా వాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా అమలుచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + twelve =