లోక్‌సభ ఎంపీ పదవీకి రాజీనామా చేసిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్

Samajwadi Party President Akhilesh Yadav Resign from Lok Sabha after being Elected As MLA from Karhal, Samajwadi Party President Akhilesh Yadav Resign from Lok Sabha, Samajwadi Party President Akhilesh Yadav Elected As MLA from Karhal, MLA from Karhal, Akhilesh Yadav Resign from Lok Sabha, Samajwadi Party President Akhilesh Yadav, Samajwadi Party President, Akhilesh Yadav, Samajwadi Party, Samajwadi Party Latest News, Samajwadi Party Latest Updates, Akhilesh Yadav Samajwadi Party President, MLA Akhilesh Yadav, Akhilesh Yadav Elected As MLA from Karhal, Mango News, Mango News Telugu,

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్‌సభకు రాజీనామా చేశారు. మంగళవారం నాడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై తన రాజీనామాను సమర్పించారు. ముందుగా 2019 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ యూపీలోని అజంగఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా ఇటీవల యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసిన అఖిలేష్ యాదవ్ కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా యూపీ అసెంబ్లీలోనే కీలక పాత్ర పోషించాలని భావించిన ఆయన, ఎంపీ పదవీకి రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ఎస్పీ కీలక నాయకుడు ఆజం ఖాన్ కూడా లోక్‌సభకు రాజీనామా చేశారు. 2019లో రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఆయన, ఇటీవల ఎన్నికల్లో రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆజం ఖాన్ కూడా ఎంపీ పదవికి చేయడం ద్వారా ఎమ్మెల్యేగానే కొనసాగనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =