2019 టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా గ్రెటా థన్‌బర్గ్‌

Climate activist Greta Thunberg, Climate crisis activist Greta Thunberg, latest breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, Time Person of the Year, Times Person of the Year 2019

ప్రపంచ వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరిన స్వీడన్‌కు చెందిన టీనేజ్ వాతావరణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ ను డిసెంబర్ 11, బుధవారం నాడు 2019 ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. టైమ్ మ్యాగజైన్ లో ఈ ఘనత అందుకున్న అతి పిన్న వయస్కురాలుగా ఆమె నిలిచింది. 16 ఏళ్ల థన్‌బెర్గ్, ఆగస్టు 2018 లో పర్యావరణ ప్రచారాన్ని ప్రారంభించి, దాన్ని ఒక ప్రపంచ ఉద్యమంగా మార్చిందని ప్రశంసించారు. ఉద్యమ ప్రారంభంలో పాఠశాల వెళ్లకుండా వాతావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వీడన్ పార్లమెంటు ముందు ప్రచారం నిర్వహించింది. గడిచిన 16 నెలల సమయంలో ఐక్యరాజ్యసమితిలో దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించడం, పోప్ తో సమావేశం కావడం, అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో అమెరికా ప్రధాని డోనాల్డ్ ట్రంప్ ను ప్రశ్నించడం వంటి అనేక అంశాల్లో గ్రెటా థన్‌బెర్గ్ పాలుపంచుకుందని చెప్పారు. వాతావరణ మార్పులపై ప్రపంచ జనాభాను అప్రమత్తం చేస్తూ, నేటి యువతరం ఒక ఉద్యమాన్ని నడిపితే ఎలా ఉంటుందో గ్రెటా నిరూపించిందని, అందుకే ఆమెను 2019 టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గుర్తించామని టైమ్ మ్యాగజైన్ చీఫ్‌ ఎడిటర్‌ ఎడ్వర్డ్‌ ఫెల్సెంథల్‌ ప్రకటించారు. గ్రెటా థన్‌బర్గ్‌-ద పవర్‌ ఆఫ్‌ యూత్‌ అనే క్యాప్షన్‌తో పోర్చుగల్‌లోని లిస్బన్‌ తీరంలో నిలుచుని ఉన్న గ్రెటా ఫొటోను టైమ్ మ్యాగజైన్ కవర్‌పేజీపై ముద్రించారు. 1927 నుంచి ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డులను ప్రకటిస్తూ వస్తుంది.

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here