కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే

IRCTC Introduces Several New Benefits For The Passengers Like Rs 10 Lakh Insurance Food At Low Price And Many More,IRCTC Introduces Several New Benefits,Several New Benefits For The Passengers,IRCTC Benefits Like Rs 10 Lakh Insurance,IRCTC 10 Lakh Insurance,Food at Low Price and Many More,IRCTC Food at Low Price,IRCTC New Benefits For The Passengers,Mango News,Mango News Telugu,Indian Railways Has Introduced New Rules, Indian Railways, Railway,Janatakhana,Insurance Scheme,Overnight Stay At The Station,IRCTC Latest News,IRCTC Latest Updates,IRCTC Live News,IRCTC New Benefits Latest News

ఇండియన్‌ రైల్వే కొత్తగా మరో రెండు నింబంధనలను తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తోంది భారతీయ రైల్వే. ప్రయాణికులకు అత్యంత సౌకర్యంతో కూడిన ప్రయాణ అనుభవాన్ని ఇవ్వడానికి రైల్వే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.

2024 ఆర్థిక సంవత్సరంలో రైల్వేను బలోపేతం చేయడం కోసం కేంద్రం నిధులు కేటాయించింది. ప్రయాణ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడానికే వీటిని ఉపయోగించనున్నారు. జనతాఖానా పేరుతో 20 రూపాయలకే భోజనం అందుబాటులోకి తెచ్చింది. అలాగే 49 పైసలకే 10 లక్షల రూపాయల బీమా కవరేజ్‌ను పొందవచ్చు. రైలు ప్రయాణ సమయంలో ప్రమాదాలు సంభవిస్తే ఈ కవరేజ్ ద్వారా ఉచిత వైద్య చికిత్స కూడా అందిస్తారు.

రైల్వే అధికారిక వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఈ విలువైన బీమా పథకానికి యాక్సెస్‌ను మంజూరు చేస్తారు. చాలామంది దీన్ని పట్టించుకోరు. కానీ 49 పైసలకే 10 లక్షల రూపాయల బీమా లభిస్తోందని, దీనిపై దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగితే నామినీకి బీమా సొమ్మును అందజేస్తారు.

ప్రయాణికులు స్టేషన్‌లో రాత్రిపూట బస చేయాల్సి వచ్చినప్పుడు వారికి ఉచితంగా వసతి కల్పించేందుకు రైల్వే ప్రయత్నిస్తోంది. ఈ సౌకర్యం ఉచితంగా అందించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పొడిగించిన స్టాప్‌లలో ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధానం త్వరలోనే అమలు చేయబోతున్నారు. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ రైలు ప్రయాణాన్ని మధురానుభూతిగా మిగల్చాలనేదే భారతీయ రైల్వే ఆకాంక్ష.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 16 =