పశ్చిమ బెంగాల్‌కు కొత్త పేరు – సీఎం సువేందు అధికారి కీలక ప్రకటన

CM Suvendu Adhikari Announced West Bengal Name Change Proposal to Be Moved in Assembly on Dec 9

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పేరు మార్పు దిశగా కీలక అడుగు పడింది. ప్రస్తుతం ‘వెస్ట్‌ బెంగాల్‌’గా పిలుస్తున్న రాష్ట్రం పేరును ‘పశ్చిమ్‌ బంగా’గా మార్చాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిసెంబర్‌ 9న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

అసెంబ్లీలో ప్రతిపాదిత తీర్మానానికి ఆమోదం లభించిన అనంతరం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు సీఎం సువేందు అధికారి వివరించారు. కేంద్రం కూడా ఆమోదం తెలిపితేనే రాష్ట్రం పేరు మార్పు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన బిల్లుతో పాటు మరో ఎనిమిది కీలక బిల్లులను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం బెంగాలీ భాషలో ‘పశ్చిమ్‌ బంగా’ అనే పేరు వాడుకలో ఉంది. పేరు మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత అధికారిక పత్రాలు, పరిపాలనా రికార్డుల్లో ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషల్లోనూ ఇదే పేరును ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రతిపాదన అమల్లోకి రావాలంటే రాష్ట్ర అసెంబ్లీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here