చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే, ప్రభుత్వం నిద్రపోతోంది…రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Congress leader Rahul Gandhi Says China Preparing for War that Threat Cannot be Ignored,Congress leader Rahul Gandhi,India Vs China War,India Vs China Military,Mango News,Mango News Telugu,India Vs China Future War,India Vs China Military Strength 2022.India Vs China War 1967,India China,India Military Power,Defence Minister Of India,India Military News,China Vs India Military,China Vs India Military Power 2022,India Vs China Air Force,

దేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ నేటితో (డిసెంబర్ 16, శుక్రవారం) 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతుండగా, 100వ రోజు మైలురాయిని అందుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని దౌసాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌ లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై స్పందిస్తూ, పొరుగుదేశం చైనా మనపై యుద్ధానికి సిద్ధమవుతోందని, అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోందని రాహులా గాంధీ ఆరోపించారు.

చైనా నుండి వచ్చే ముప్పును ప్రభుత్వం తక్కువ చేసిందని రాహుల్ అన్నారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది, చొరబాటు కోసం కాదు. వారి ఆయుధాల నమూనా చూస్తే, వారు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మన ప్రభుత్వం దానిని అంగీకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాలపై కాకుండా, సంఘటనలపై పని చేస్తుంది. చైనా ముప్పును మనం విస్మరించలేము లేదా దాచలేమని రాహులా గాంధీ అన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైందని, అయిపోయిందని అనడం పూర్తిగా తప్పు అని, కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతంమని, దేశంలో సజీవంగా కోట్లాది ప్రజల గుండెల్లో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే పోరాడుతుంది, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడిస్తుందన్నారు. ఓట్లు అవసరం లేనప్పుడు ఎందుకు యాత్ర చేస్తున్నారని ప్రశ్నించగా, దేశంలో బీజేపీ భయాన్ని, ద్వేషాన్ని వ్యాపింపజేసింది కాబట్టే తిరుగుతున్నానని, ఆ భయాన్ని, ద్వేషాన్ని పోగొట్టడానికే తిరుగుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ద్వేషంతో పోరాడిన చరిత్ర మనకు ఉందని, తానే మొదటివాడిని కాదని , చివరివాడిని కూడా కాదని అన్నారు.

కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన నాయకులపై వ్యాఖ్యానిస్తూ, వారు అలా చేయడాన్ని రాహుల్ స్వాగతించారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడాలని కోరుకుంటే, కొంతమందికి బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకుంటే, వారు పార్టీని వీడడాన్ని స్వాగతిస్తానని, వారు తమకు వద్దు అని, కాంగ్రెస్ పార్టీని నమ్మి, ఫాసిజాన్ని నమ్మని వారు కావాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇక గుజరాత్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీసిందని, ఆప్‌ పోటీలో లేకుంటే బీజేపీని కాంగ్రెస్‌ పార్టీ ఓడించి ఉండేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 4 =