చెన్నైని ముంచేసిన భారీ వర్షం

Chennai experiences sudden downpour, Chennai sees heavy rains, Chennai witnesses heavy rains, Floods in Chennai Due to Heavy Rains, heavy rain in chennai latest news, heavy rain in chennai today, IMD issues warning for Dec 31 and Jan 1, Mango News, rain in chennai 2021, rains in chennai today, Several areas in Chennai flooded after record rain, Severe Floods in Chennai, Severe Floods in Chennai Due to Heavy Rains

ఎటు చూసినా జలమయం.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఎటూ వెళ్లలేక.. ఉన్నచోటనుంచి ముందుకు కదలలేక చెన్నైలో ప్రజలు నరకం చూశారు. చెన్నై లో అనేక ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తడంతో వాహనదారులకు పగలే చుక్కలు కనిపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అక్టోబరు, నవంబర్‌ నెలల్లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం వరద నీట మునిగింది.

వర్షాల సీజన్‌లో చెన్నై నీట మునగడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మధ్యాహ్నం ప్రాంతంలో తొలుత చిరు జల్లులుతో మొదలై క్రమంగా భారీగా వర్షం పడింది. నగరంలోని గింది, సైదా పేట, వడపళని, నుంగంబాక్కం, ఎంఆర్‌సీ నగర్, కేకేనగర్, అరుంబాక్కం తదితర మార్గాలు, ఉత్తర చెన్నై పరిధిలోని అనేక రోడ్లలో వాహనాలు నిలిచిపోయాయి. అత్యధికంగా ఎంఆర్‌సీ నగర్‌లో 18 సె.మీ, నుంగంబాక్కంలో 15 సె.మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ద్రోణి చెన్నై సమీపంలో కేంద్రీకతమై ఉందని, దీని ప్రభావంతోనే వర్షాలు పడుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − twelve =