జనవరి 12న కర్నాటకలో 26వ నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi to Inaugurate 26th National Youth Festival in Hubbali Karnataka on January 12th,Indian Prime Minister Narendra Modi,PM Narendra Modi,Indian PM Modi,Mango News,Mango News Telugu,National Youth Festival 2023,National Youth Festival Started In Which Year,25Th National Youth Festival,26Th National Youth Festival,National Youth Festival 2023 Registration,25Th National Youth Festival 2023 Theme,23Rd National Youth Festival,National Youth Festival 2023 Venue In India,National Youth Festival 2023 Theme,National Youth Festival 2023 Venue,National Youth Festival 2023 Registration Form,National Youth Festival 2023 Puducherry,25Th National Youth Festival 2023,24Th National Youth Festival

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 12, గురువారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బలిలో 26వ జాతీయ యువజనోత్సవాలను (నేషనల్ యూత్ ఫెస్టివల్) ప్రారంభించనున్నారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు, బోధనలు మరియు సేవలను గౌరవించడం కోసం ఆయన జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో మన ప్రతిభావంతులైన యువతకు గుర్తింపును అందించడంతోపాటు, వారిని దేశ నిర్మాణం దిశగా ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ యువజనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇది దేశంలోని అన్ని ప్రాంతాల నుండి విభిన్న సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకువస్తుందని మరియు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో పాల్గొనేవారిని ఏకం చేస్తుందన్నారు.

ఈ సంవత్సరం కర్ణాటకలోని హుబ్బల్లి-ధార్వాడ్‌లో జనవరి 12 నుండి 16 వరకు “విక్సిత్ యువ-విక్సిత్ భారత్” అనే థీమ్‌తో ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఫెస్టివల్ యూత్ సమ్మిట్‌కు సాక్ష్యంగా ఉంటుంది, ఇది జీ-20 మరియు వై-20 ఈవెంట్‌ల నుండి ఉత్పన్నమయ్యే ఐదు థీమ్‌లపై (ఫ్యూచర్ వర్క్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ మరియు 21 సెంచరీ స్కిల్స్, క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, పీస్ బిల్డింగ్ అండ్ రికన్సిలేషన్, షేర్డ్ ఫ్యూచర్ యూత్ ఇన్ డెమోక్రసీ అండ్ గవర్నన్స్, హెల్త్ అండ్ వెల్ బీయింగ్) ప్లీనరీ చర్చలకు సాక్ష్యంగా ఉంటుందన్నారు. ఈ సమ్మిట్‌లో అరవై మందికి పైగా ప్రముఖ నిపుణులు పాల్గొననున్నారని, అనేక పోటీ మరియు పోటీయేతర ఈవెంట్‌లు కూడా నిర్వహించబడతాయన్నారు. పోటీ ఈవెంట్‌లలో జానపద నృత్యాలు, పాటలు ఉంటాయని మరియు స్థానిక సాంప్రదాయ సంస్కృతులకు ప్రోత్సాహాన్ని అందించడానికి నిర్వహించబడతాయని తెలిపారు.

పోటీయేతర ఈవెంట్‌లలో యోగాథాన్ ఉంటుందని, ఇందులో యోగా చేయడానికి దాదాపు 10 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. జాతీయ స్థాయి ప్రదర్శనకారులచే ఈ కార్యక్రమంలో ఎనిమిది దేశీయ క్రీడలు మరియు యుద్ధ కళలు కూడా ప్రదర్శించబడనున్నాయి. ఇతర ఆకర్షణలలో ఫుడ్ ఫెస్టివల్, యంగ్ ఆర్టిస్ట్ క్యాంప్, అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, స్పెషల్ నో యువర్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ క్యాంపులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 5 =