దేశంలో 1,862కి చేరిన యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేట్ ఎంతంటే?

Corona in India 156 New Positive Cases Reported And Active Cases Stands at 1862,156 New Corona Cases,Covid Recoveries Reported,India in the Last 24 Hours,Mango News,Mango News Telugu,Covid Deaths,Covid Last 24 Hours, 126 People Tested Positive,Coronavirus In India,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 156 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 17, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,84,658 కు చేరుకుంది. దేశంలో దాదాపు నెల రోజుల తర్వాత 150కి పైగా కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,757 గా ఉంది. ముఖ్యంగా కర్ణాటక (47), కేరళ (46), మహారాష్ట్ర (19), పంజాబ్ (7), తెలంగాణ (6) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. కాగా దేశంలోని 19 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదుకాలేదు.

దేశంలో 1,862 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.81 శాతం:

దేశంలో ప్రస్తుతం 1,862 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 129 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,52,039 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు ఫిబ్రవరి 16న 1,28,584 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.12 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 3 =