విద్యార్థులకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు – పెద్దాపురం పర్యటనలో చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu Interacts with Students in Peddapuram During Kakinada District Visit,TDP Chandrababu Naidu,Interacts with Students,Peddapuram Visit,Kakinada District Visit,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

విద్యార్థులకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన మూడు రోజుల తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి పెద్దాపురంలో పర్యటించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు చంద్రబాబును కలుసుకున్నారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయన తన భావాలను పంచుకున్నారు. విద్యార్థులతో ముచ్చట్లు ఎప్పుడూ ఆసక్తికరమే, ఆహ్లాదకరమేనన్న ఆయన పెద్దాపురం పర్యటనలో వారితో కొద్దిసేపు గడిపే అవకాశం దక్కిందని సంతోషం వెలిబుచ్చారు.

వీళ్ళందరికీ ఎన్నో లక్ష్యాలు ఉంటాయని, ఆ లక్ష్యాలను చేరుకునేలా వారికి అవకాశాలు కల్పించడం పాలకుల విధి అని చంద్రబాబు పేర్కొన్నారు. మనం విద్యార్థులకు సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అంతకుముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో పాల్గొన్న చంద్రబాబు జిల్లాలో పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా గంజాయి సరఫరా, బ్లేడ్ బ్యాచ్ ల ఆగడాల గురించే ప్రజలు చెపుతున్నారని, తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారని తెలిపారు. డీజీపీ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు గంజాయి నివారణపై దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని, గంజాయితో మన బిడ్డల భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలని చంద్రబాబు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − ten =