ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం.. భార‌త్‌లో రెండు ట్విట్ట‌ర్ ఆఫీస్‌లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు

Elon Musk Shuts Down 2 Twitter Offices Delhi and Mumbai in India Asks Staff To Work From Home,Elon Musk Net Worth,Richest Man In The World,Elon Musk Net Worth Peak,Mango News,Mango News Telugu,Elon Musk Net Worth In Billion,Elon Musk Net Worth In Rupees,Elon Musk Net Worth 2023,Elon Musk Loses Today,Elon Musk Weight Loss,Elon Musk Net Worth Loss,Elon Musk Child Loss,Elon Musk Weight Loss Shot,Elon Musk Diabetes Drug Weight Loss,Elon Musk Hearing Loss,Elon Musk Weight Loss App,Elon Musk Weight Loss Medicine,Elon Musk Weight Loss Medication,Elon Musk Bitcoin Losses

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్ట‌ర్ అధిపతి ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భార‌త్‌లోని మూడు ట్విట్ట‌ర్ ఆఫీస్‌ల్లో రెండింటిని మూసివేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ, ముంబై నగరాలలోని ఆఫీసులు మూసివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫీస్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కోరినట్లు సమాచారం. కాగా ఖ‌ర్చులు త‌గ్గించాల‌న్న ఉద్దేశంతో గ‌త ఏడాది చివర్లో ట్విట్ట‌ర్ సంస్థ దేశంలోని తమ కార్యాలయాల్లో ప‌నిచేస్తున్న దాదాపు 200 మందికి పైగా సిబ్బందిలో 90 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన విష‌యం తెలిసిందే. అయితే బెంగళూరులోని దక్షిణ టెక్ హబ్‌లో ఎక్కువగా ఇంజనీర్లు ఉన్న కార్యాలయాన్ని మాత్రం కొనసాగిస్తోంది.

ఇక ట్విట్టర్ గత సంవత్సరాల్లో భారతదేశం యొక్క అత్యంత ముఖ్యమైన పబ్లిక్ ఫారమ్‌లలో ఒకటిగా పరిణామం చెందింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 86.5 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉంది. అలాగే దేశంలో ఎంతోమంది సభ్యులను కలిగి ఉంది. అయినప్పటికీ దేశంనుంచి సంస్థకు లక్ష్యం మేరకు ఆదాయం అందడం లేదని సమాచారం. దీంతో మస్క్ ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఎలోన్ మస్క్ 2023 చివరి నాటికి ట్విట్టర్‌ను ఆర్థికంగా స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది సిబ్బందిని తొలగించారు. అలాగే ఎన్నో కార్యాలయాలను మూసివేశారు. అయితే కంపెనీని ఆర్ధికంగా బ‌లోపేతం చేయ‌డానికి ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని ఇటీవ‌లే మ‌స్క్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =