కరోనా ఎఫెక్ట్: మాస్కులు ఎవరు వాడాలి? ఎలా వాడాలి?

Coronavirus, Coronavirus Live, coronavirus masks, Coronavirus Masks Usage, Coronavirus outbreak, Coronavirus Updates, Guidelines for home quarantine, Guidelines On masks Usage, Guidelines on use of masks, Health Family Welfare Department, Ministry of Health and Family Welfare

దేశంలో ప్రస్తుతం కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతూ పలురకాల మాస్కులు వాడకంపై దృష్టి సారించారు. అయితే ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అసలు మాస్కులు ఎవరు వాడాలి? ఎలా వాడాలి? ఎలాంటి  పరిస్థితుల్లో వాడాలి? వంటి మార్గదర్శకాలను విడుదల చేశారు.

మాస్కులు ఎవరు వాడాలి?:

  • దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే మాస్కులు వాడాలి.
  • కరోనా వైరస్ సోకిన వారు లేదా అనుమానితులు యొక్క బాధ్యతలు మీరు చూస్తుంటే మాస్క్ వాడాలి.
  • ఇతర శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లు దగ్గర పనిచేసే హెల్త్ వర్కర్ అయితే మాస్క్ వాడాలి. 

మాస్కులు ధరించి ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • మాస్క్ ను పూర్తిగా విప్పి శ్వాస సంబంధిత భాగం కిందకి ఉండేలా చూసుకోవాలి.
  • ప్రతి ఆరు గంటలకు ఒకసారి లేదా మాస్కు తడిగా మారినప్పుడు మాస్క్ లను మార్చి వేస్తూ ఉండాలి.
  • మాస్కులు పూర్తిస్థాయిలో ముక్కు, నోరు, గడ్డాన్ని కవర్ చేసేలా వేసుకోవాలి.
  • ఒకసారి వాడిన మాస్క్ ను తిరిగి వాడకుండా మూత ఉన్న డస్ట్ బిన్ లలో పడేయాలి.
  • మాస్క్ లను వాడుతున్నప్పుడు వాటిని తాకకూడదు. 
  • మాస్క్ లను తీసివేసే సమయంలో కూడా వాటి బయట భాగం లేదా ముందు భాగాన్ని చేతులతో తాకకూడదు.
  • మాస్కులు మెడపై వేలాడుతూ ఉండేలా వేసుకోకూడదు.
  • ఒకసారి మాస్కులు తీసివేసిన తర్వాత నీళ్ల తో గాని, సబ్బుతో గాని, లేదా ఆల్కహాల్ శానిటైజర్స్ తో గాని చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

 

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 1 =