కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ లాక్డౌన్ గడువు పూర్తయ్యే వరకు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్లు, మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, బార్లు మూసివేస్తునట్టు తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొన్నారు.
లాక్డౌన్ పొడిగింపు మార్గదర్శకాలు – అనుమతి ఉన్నవి:
- ప్రజలకు అవసరమైన వస్తువుల సరఫరా
- కొరియర్ సేవలు
- ఐటి మరియు ఐటి-సంబంధిత సేవలు
- ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా
- ఇ-కామర్స్ కంపెనీలు
- ప్రభుత్వ కార్యాలయాలు
- ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌లు
- ఫార్మసీలు, డిస్పెన్సరీలు, మెడిసిన్ షాపులు
- వెటర్నరీ ఆస్పత్రులు, పాథాలజీ ల్యాబ్‌లు, వ్యాక్సిన్ అమ్మకం మరియు సరఫరా
- ఔషదాల తయారీ యూనిట్లు, వైద్య పరికరాలు
- వ్యవసాయ మరియు సంబంధిత కార్యకలాపాలు
- ఫిషరీస్ -ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలు
- తోటల పెంపకాలు
- పశుసంరక్షణ వ్యవహారాలు
- బ్యాంకు శాఖల నిర్వహణ, ఏటిఎంలతో సహా ఆర్థిక రంగం
- సామాజిక రంగ కార్యకలాపాలు
- ఉపాధి హామీ పనుల కార్యకలాపాలు
- నిత్యావసర వస్తువుల రవాణా/ రాష్ట్రంలో పాటు ఇతర రాష్ట్రాల మధ్య రవాణా.
లాక్డౌన్ పొడిగింపు మార్గదర్శకాలు – అనుమతి లేనివి:
- దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, రైలు ప్రయాణం
- ప్రజా రవాణా
- మెట్రో రైలు సేవలు
- క్యాబ్‌లు, టాక్సీలు
- రాష్ట్రంలో మరియు ఇతర రాష్ట్రాల మధ్య వ్యక్తుల చేసే ప్రయాణం
- విద్యాసంస్థలు, శిక్షణా సంస్థలు
- ఆతిథ్య సేవలు, పార్టీల నిర్వహణ
- థియేటర్లు, మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, బార్లు
- మతపరమైన ప్రదేశాలు, దైవ కార్యక్రమాలు నిషేధం
- అంత్యక్రియలకు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి గుమికూడకూడదు
- వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధం
- బహిరంగ ప్రదేశాల్లో, పని చేసే చోట మాస్కులు ధరించడం తప్పనిసరి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]