దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్, ఇప్పటికే 18 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

India Cumulative Covid-19 Vaccination Coverage Crosses 18 Crore,Mango News,Mango News Telugu,India's Cumulative Vaccination Coverage Crosses 18 Crore Mark,Covid-19,India Crosses More Than 18 Crore Cumulative Vaccination Coverage,Health Ministry,Coronavirus Vaccination In India,India's Cumulative,Coronavirus Vaccination,India Coronavirus Vaccination,Coronavirus Vaccination India,Coronavirus Vaccination Latest Updates,Coronavirus Vaccination News,Coronavirus,Vaccination,India Coronavirus Latest News Live Updates,Coronavirus India News Live Updates,India's Cumulative Vaccination Coverage Crosses 18 Cr,India Crosses Major Landmark With More Than 18 Cr,Coronavirus Crisis

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 18 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా మూడో దశలో భాగంగా మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 15, శనివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 18 కోట్లు (18,04,57,579) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

అలాగే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 119వ రోజైన మే 14, శుక్రవారం నాడు 11 లక్షలకుపైగా (11,03,625) వ్యాక్సిన్ డోసుల పంపిణీ‌ చేసినట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటిదాకా మొత్తం 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 18-44 సంవత్సరాల వయస్సు గల 42,58,756 మంది లబ్ధిదారులు కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసును తీసుకున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 18 =