సుమారు 11 కోట్లతో పీవీ విజ్ఞాన వేదిక, డిజైన్స్ విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Mango News, Minister Srinivas Goud, Minister Srinivas Goud Released PV Vignana Vedika Designs, PV Vignana Vedika, PV Vignana Vedika at Vangara, PV Vignana Vedika Designs, PV Vignana Vedika Latest News, PV Vignana Vedika News, Srinivas Goud releases PV Vignan Vedika designs, TS govt sanctions Rs 7 crore for PV Vignana Vedika at Vangara, Vangara

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు నివసించిన వంగర గ్రామమును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నట్టు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు, అందుకు సంబంధించి సుమారు 11 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో నిర్మించబోయే పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ లను హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తన కార్యాలయంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.యస్ శ్రీనివాసరాజుతో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పీవీ శతజయంతి వేడుకలలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే అశయంతో వారి పేరిట పీవీ విజ్ఞాన వేదికను వంగర గ్రామంలో నిర్మిస్తున్నామన్నారు. మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మృతివనంలాగా పీవీ విజ్ఞాన వేదికను తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం గర్వించే వ్యక్తిగా పట్వారీ నుండి ప్రధానమంత్రిగా ఎదిగిన పీవీ ప్రతి ఓక్కరికి స్పూర్తి ప్రధాతగా నిలిచారన్నారు. పీవీ నర్సింహారావు ప్రవేశ పెట్టిన సంస్కరణలు, వారి పరిపాలన భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆయన నివసించిన ఇంటిని మ్యూజియంగా, వంగర గ్రామంలో సుమారు 8 ఎకరాలలో పీవీ విజ్ఞాన వేదికను రూపోందిస్తున్నామన్నారు.

అందుకు మొదటి దశలో 7 కోట్ల రూపాయలతో పీవీ విజ్ఞాన వేదికలో పీవీ విగ్రహానికి ఫౌంటైన్, లైటింగ్, వారి విజయాలు, పోటో గ్యాలరీ, మోడిటేషన్ సెంటర్, సైన్స్ మ్యూజియం, మేజ్ గార్డేన్, చిల్డ్రన్ ఆట స్థలాలు, స్వాతంత్ర సమరయోధుల శిల్పాలు, యాంఫి థియేటర్, ఫుడ్ కోర్టుల నిర్మాణానికి 686.25 లక్షల రూపాయలను కేటాయించామన్నారు. పీవీ నివాసాన్ని మోమోరియల్ మ్యూజియంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఆయన వాడిన వస్తువులను ఈ మ్యూజియంలో భద్రపర్చుతున్నామన్నారు. పీవీ విగ్రహాం, ల్యాండ్ స్కేపింగ్ తో సిట్టింగ్ బెంచేస్, మంచీనీటి వసతి, పాత్ వేలను 75.00 లక్షల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామన్నారు. టోటల్ ప్రాజెక్టు వ్యయం 1098.45 లక్షలతో వంగరలో పీవీ విజ్ఞాన వేదికను నిర్మిస్తున్నామన్నారు. జివో ఆర్టి నెంబర్ 22 ప్రకారం రూ.7 కోట్ల రూపాయలను తోలిదశ పనులకోసం కేటాయించామన్నారు. ఇప్పటికే టెండర్లును పిలిచామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − four =